NRI husband

NRI husband: ఇట‌లీలో భ‌ర్త‌! ఏపీలో న‌డిరోడ్డుపై భార్య! మ‌ధ్య‌లో ప్రియురాలి ఎంట్రీ!

Spread the love

NRI husband: పెళ్లైన కొద్ది రోజుల‌కే ఇట‌లీ చెక్కేశాడు ఓ ఎన్నారై భ‌ర్త‌. ఆ త‌ర్వాత భార్య‌ని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశాడు. అత్తారింట్లో క‌ట్నం తీసుకురావాలంటూ వేధింపుల‌కు మొద‌ల‌య్యాయి. చివ‌రికి…


NRI husband: పెళ్లైన కొద్ది రోజుల‌కే ఇటీల వెళ్లిపోయాడు భ‌ర్త‌. త‌న‌ను తీసుకెళ్తాడ‌ని ఎదురు చూస్తున్న భార్య‌కి అత్తారింట్లో చేదు అనుభ‌వం ఎదురైంది. అద‌న‌పు క‌ట్నం తేవాలంటూ వేధింపులు మొద‌ల‌య్యాయి. ఇంత‌లోనే ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఇటలీలో భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని తెలియ‌డంతో భార్య కంగుతిన్న‌ది. పెళ్లి పేరుతో త‌న‌ను మోసం చేశార‌ని, త‌న‌కు న్యాయం చేయాలంటూ బాధితురాలు న్యాయ‌పోరాటానికి దిగింది.

బాధితురాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రానికి చెందిన బొర్రా సుధీర్ కుమార్‌తో కిర‌ణ్మ‌యికి నాలుగేళ్ల కింద‌ట వివాహ‌మైంది. కొద్ది రోజులు కాపురం సాఫీగానే సాగింది. పెళ్లైన కొద్దిరోజు ల‌కే ఇటలీ వెళ్లిపోయిన భ‌ర్త సుధీర్‌.. భార్య‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. కొద్ది రోజుల‌కే అత్తారింట్లో కోడ‌లికి వేధింపులు మొద‌ల‌య్యాయి. అద‌న‌పు క‌ట్నం తీసుకురావాలంటూ సాధించ‌డం మొద‌లు పెట్టారు. మౌనంగా భ‌రిస్తూ వ‌చ్చిన కిర‌ణ్మ‌యికి షాకింగ్ విష‌యం తెలిసింది. భ‌ర్త ఇట‌లీలో విజ‌య‌వాడ‌కు చెందిన మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని తెలియ‌డంతో మోస‌ పోయాన‌ని గ్ర‌హించింది. న్యాయ పోరాటానికి దిగింది. త‌న‌కు న్యాయం చేయాలంటూ మామ వెంక‌ట్రావు ఇంటి ఎదుట నిర‌స‌న దీక్ష చేప‌ట్టింది.

Pedana(Krishna): విషాదం: అప్పుల బాధ‌తో చేనేత కుటుంబం ఆత్మ‌హ‌త్య‌

Pedana(Krishna) పెడ‌న: అప్పుల బాధ‌తో ఓ చేనేత కుటుంబం (Handloom family suicide)అంతా సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద సంఘ‌ట‌న కృష్ణా జిల్లా పెడ‌న‌లోని మంగ‌ళ‌వారం వెలుగుచూసింది. Read more

Chevuturu(Krishna) Road accident:ఘోర రోడ్డు ప్ర‌మాదం ఆరుగురు ప్ర‌యాణికులు మృతి?

Chevuturu(Krishna) Road accident చెవుటూరు: కృష్ణా జిల్లా జి.కొండూరు మండ‌లంలోని చెవుటూరు స‌మీపంలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. తిరువూరు డిపోకు చెందిన ఎక్సప్రెస్ Read more

Tiruvuru Revenue Division:తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్ స్వాగ‌తిస్తూ సంబురాలు!

Tiruvuru Revenue Division ఎ.కంభంపాడు: కృష్ణా జిల్లా నుండి విడిపోయిన ఎన్టీఆర్ జిల్లా (విజ‌య‌వాడ‌)లో తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా తిరువూరు రెవెన్యూ డివిజ‌న‌ల్‌ను ప్ర‌భుత్వం నిర్థారించింది. దీనిని Read more

Nuzvid Covid Cases: నూజివీడు డివిజన్ లో కొత్తగా 168 కోవిడ్ కేసులు

Nuzvid Covid Cases నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్ లో 28వ తేదీన కోవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదయ్యాయి. 28వ తేదీ ఒక్కరోజే 168 కోవిడ్ Read more

Leave a Comment

Your email address will not be published.