North Sentinel Island | 1896 లో అండమాన్ జైలు(Andaman jail) నుంచి తప్పించుకున్న ఓ ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు ఓ దీవి(Island)కి చేరుకున్నారు. అప్పటి వరకు ప్రపంచానికి ఈ దీవి గురించి తెలియకపోవడంతో పోలీసులు ఆ ఐలాండ్‌లో అడుగు పెట్టంగానే ఒక్కసారిగా బాణాలు వారి మీదకు దూసుకు వచ్చాయి. పోలీసులు ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే బాణాలు వారి శరీరాల్లోకి చొచ్చుకొని పోయాయి. అప్పటి నుండి ఈ దీవిలోనే కాదు. ఆ దీవి గుండా సముద్ర మార్గం వెళ్లాలన్నా మనుషులు భయపడ్డారు.
ది సెంటినల్ ఐలాండ్ స్టోరీ!
అదే సెంటినల్ ఐలాండ్(North Sentinel Island). రెండవ సారి సెంటినల్ ఐలాండ్ గురించి 1974 సంవత్సరంలో ప్రపంచానికి తెలిసింది. ఓ సినిమా బృందం సినిమా షూటింగ్ కోసం సెంటినల్ దీవికి వెళ్లింది. వారిపై ఈ తెగవారు ఒక్కసారిగా బాణాలు సంధించారు. ఈ సంఘటనతో భయపడిన సినిమా బృందం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చారు. ఈ ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఈ తెగవారిపై పరిశోధనలు జరపాలని సైంటిస్టులకు అనుమతి ఇచ్చింది. దీంతో వారిపైనా కూడా ఈ తెగవారు దాడులు చేయడంతో ఇకపై ఈ దీవిలోకి ఎవ్వరూ వెళ్లకూడదని, దీవి సమీపంలోకి ప్రయాణించ కూడదని ఆదేశాలు జారీ చేసింది.
మనుషులు ఎవ్వరూ ఈ దీవి పరిధిలోని 3 కిలోమీటర్ల వరకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. విశేషం ఏమిటంటే వీరు నివసించేది భారతదేశంలోనే. అండమాన్ దీవుల్లో ఒకటైన నార్త్ సెంటినల్ దీవులో నివసించే ఈ జాతి ఒక ప్రత్యేకమైన సెంటినలీస్. ఇండియాలో ఉండే మనల్ని ఇండియన్స్ అంటారు. అక్కడ నివసించే వారిని సెంటినలీస్ అంటారు. చరిత్ర చెబుతున్న ప్రకారం వీరు ఆఫ్రికా నుంచి 60 వేల ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచి వీరు ప్రపంచాన్నే వెలివేసి బ్రతుకుతున్నారు.

ఆఫ్రికా తెగవారేనా?
వీరి ఆహార్యం ఎక్కువుగా ఆఫ్రికా(Africa) ఖండంలో ఉండే తెగల వారితో పోలీ ఉండటంతో ఎక్కువ మంది వీరు ఆఫ్రికా వారేనని భావిస్తుంటారు. ఈ జాతి ప్రజలు మనుషుల్ని హత్య చేసినా ప్రభుత్వం ఏమీ చేయలేదు. 1859లో అక్కడ ఉన్న వేరే ట్రైబల్స్‌కి, బ్రిటీష్ ఆర్మీకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సగం మంది చనిపోయారు. మిగిలిన వారు అక్కడున్న చిన్న చిన్న ఐలాండ్స్కు పారిపోయారు. ఇప్పుడు ఆ ద్వీపంలో సెంటనలీస్ 300- 400 మధ్య జనాభా ఉన్నట్టు అంచనా. సెంటినల్ జీవనాధారం వేట.
అక్కడ ఉన్న అడవులోని జంతువుల్ని ఆహారంగా తీసుకుంటారు. వీటితో పాటు అడవిలో దొరికే పండ్లు, చేపలు, తేనెను ఆహారంగా తీసుకుంటారు. వీరు బాణాలను, విల్లును ఆయుధాలుగా ఉపయోగిస్తారు. వీరు మాట్లాడే భాష ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు. ఈ తెగ వారు బయట ప్రపంచంలో బ్రతకలేరు. ఎందుకంటే వీరి శరీరం అనేక మార్పులు చోటు చేసుకుంటుంది. వీరికి వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువుగా ఉంటుంది. మనకు వచ్చే జలుబు, దగ్గులకు కూడా వీరు చనిపోయే ప్రమాదం ఉంది. బ్రిటీష్ ప్రభుత్వం 1880లో సెంటనీలిస్పై దాడి చేసి అందులో ఇద్దరు దంపతులను, పిల్లల్ని పోర్ట్‌బ్లెయిర్‌కు తీసుకు వచ్చింది.
వారికి ఇమ్యూనిటీ పవర్ తక్కువే!
కొన్ని రోజులకే ఆ దంపతులకు ఆ వాతావరణం పడక చనిపోవడంతో ఆ పిల్లల్ని మళ్లీ అడవులో వదిలివేశారు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఓ పర్యాటకుడు వీరి గురించి తెలుసుకునేందుకు అక్కడకు వెళ్లినప్పుడు అతన్ని వీరు బాణాలతో పాటు కొట్టి చంపేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రపంచానికి వీరి గురించి మరోసారి తెలిసింది. 2004లో సునామీ అనేక తీర ప్రాంతాలను నాశనం చేసింది. దీంతో సెంటినలీస్‌కు ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం భారత కోస్ట్గార్డులతో ఓ హెలికాఫ్టర్‌ను పంపింది. వీటిని చూసిన ఆ ప్రజలు భాణాలతో దాడి చేశారు.
ఇద్దరు జాలర్లను హత్య!

2006లో ఇద్దరు భారతీయులు చేపల పట్టేందుకు ఐలాండ్ వద్దకు వెళ్లగా, మళ్లీ వారు తిరిగి రాలేకపోయారు. వీరిని వెతికే బాధ్యతను ప్రభుత్వం ప్రవీణ్ గౌర్‌కు బాధ్యతలు అప్పగించింది. అప్పుడు ఆఫీసర్ ఐలాండ్ దగ్గరలో ఓ పడవ ఉండటాన్ని గమనించి అటుగా వెళ్లసాగారు. వేగంగా వారిపైన బాణాలు వచ్చి పడ్డాయి. అయితే ఆఫీసర్ ఓ హెలికాప్టర్ ద్వారా వెళ్లారు. ఈ తెగ వారు బాణాలు 100 అడుగుల కంటే ఎత్తులోకి విసురుతున్నారు. ఆఫీసర్‌కు ఒక ఐడియా వచ్చింది. హెలికాప్టర్‌ను 2 కిలోమీటర్ల వరకు ఎత్తులో దూరంగా తీసుకెళ్లాం. వారు వెంబడిస్తూ రెండు కిలోమీటర్ల వరకు వచ్చారు. వెంటనే హెలికాఫ్టర్‌ను వారి దీవి వద్దకు తీసుకెళ్లి మట్టిలో వెతికాం. అక్కడ పడవలో ఉన్న తాడుతో ఇద్దరు వ్యక్తులను చంపి పూడ్చి పెట్టారు.
ఒక శవం తీసిన తర్వాత మరో శవాన్ని తీస్తుండగా వారు వస్తున్నట్టు అర్థమైంది. మా వద్ద ఆయుధాలు ఉన్నప్పటికీ వాటిని చట్ట ప్రకారం వాడకూడదు. కాబట్టి మా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒకరి మృతదేహాన్ని మాత్రమే తీసుకొని బయట పడ్డాం. రెండో సారి అదే ప్లాన్ అమలు చేద్ధామనుకున్నాం. కానీ వారు మాకు గట్టి షాక్ ఇచ్చారు. ఈ సారి కొందరు అక్కడ ఉండగా, మరికొందరు హెలికాప్టర్‌ను తరముతున్నారు. దీన్ని బట్టి వారు తెలివిగలవారని మేము ఊహించాం అని ఆఫీసర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇటీవల జాన్ అలెన్ చూ అనే ఓ క్రైస్తవ మత బోధకుడు ఆ దీవికి వెళ్లాడు. సెంటినల్ ప్రజలతో మాట్లాడి వారిని క్రైస్తవ్యం వైపు నడిపించాలనే ఆలోచనతో ఇండియాకు వచ్చాడు.ఈ క్రమంలో వారిని కలుసుకోవడానికి ప్రతిరోజూ ఆ ఐలాండ్ చుట్టు ప్రక్కలకు వెళ్లేవాడు.
ఎవరు చెప్పినా వినిపించుకోరు!
ఇందుకు గాను జాన్ అలెగ్జాండర్ అనే బోటు నడిపే వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో జాన్ తన అనుభవాల గురించి ఓ బుక్‌లో రాసిపెట్టుకున్నాడు. అతను సెంటినలీస్‌ను కలుసుకునే ముందు అతను తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఒక ఇంటిలో సుమారు 10 మంది నివసిస్తుంటారు. నా అంచనా ప్రకారం వీరి జనాభా 250 వరకు ఉండొచ్చు. నేను గమనించిన దానిని బట్టి 10 ఏళ్ల లోపు పిల్లలు, యువకులు ఎక్కువుగా ఉన్నట్టు గుర్తించాను. బహుశా వృద్ధులు ఐలాండ్‌కు అటువైపుగా ఉంటారేమో. కొంత మంది ఆడవాళ్లు కూడా ఉన్నట్టు గుర్తించాను.సెంటనలీస్ గాల్లోకి చేతులు లేపారంటే ఏమీ కీడు చేయరని అర్థం. న్యారోస్ను సిద్ధం చేస్తున్నారంటే వేటాడనున్నారని అర్థం. ఎవరు చెప్పినా వారు వినిపించుకోరు. వారి నిర్ణయం మార్చుకోరు.

వారు గట్టిగా అరుస్తారు. వారి శబ్ధాల్లో బి,పి, టి,ఎల్ అనే అక్షరాలు ఉన్నాయి. అక్కడున్న బాణాలు ఆధారంగా వాటిని లోహంతో తయారు చేసినట్టు గుర్తించాను. ముఖ్యంగా పడవలో ఉపయోగించే లోహం అది. అంటే దీవిలో పాత పడవలనుంచి కొన్ని లోహాలు తీసుకొని బాణాలు తయారు చేస్తున్నారు. అని తన పుస్తకంలో రాశాడు. ఆ ఐలాండ్‌లోకి వెళ్లవద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అతను లోపలికి వెళ్లాడు. 24 గంటలు గడిచినా కూడా అతను ఐలాండ్ నుండి బయటకు రాలేదు. కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిని సముద్రం ఒడ్డున పూడ్చి పెట్టడం చూసిన అలెగ్జాండర్ డెడ్ బాడీకి ఉన్న బట్టలను చూసి జాన్‌గా గుర్తించాడు. ఆ తరువాత ఆ విషయాన్ని అలెగ్జాండర్ అమెరికాలో ఉన్న జాన్ తల్లికి తెలియజేశాడు. ఆమె వెంటనే అమెరికా కాన్సులేట్‌కు తెలియజేసింది.
మధుమాలకు వారితో స్నేహబంధం
అమెరికా కాన్సులేట్ అధికారులు వెంటనే భారత్ అధికారులకు తెలిపారు. దీంతో నవంబర్ 19న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జాన్ సెంటినలీస్ దగ్గరు వెళ్లక ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు వైరల్ అయ్యింది. మీ అందరికీ నేను పిచ్చోడులా కనిపించొచ్చు. కానీ అండమాన్‌లో ఉన్న సెంటినలీస్‌కు జీసస్ గురించి చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది. దేవుడా నాకు చనిపోవాలని లేదు. దేవుడా ఒక వేళ వారు నన్ను చంపివేస్తే వారి మీద కోపగించుకోవద్దు అని అంటూ జాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సెంటినలీస్‌ని దగ్గర నుండి కూడా చూడటానికి భయపడుతున్న వేళ వారిని సామాజిక సేవా పరిశోధకురాలు మధుమాల ఛటోపాధ్యాయ వారిని కలవడం జరిగింది. 1999లో సెంటినలీస్‌కు మధుమాల తొలిసారిగా కలిసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సెంటినలీస్ చాలా బలంగా ఉంటారు.

వారు బలమైన వారు తెలివైన వారు
ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ బలమైన 5 గురు యువకులను కూడా అవలీలగా మట్టికరిపించగలడు. నిజానికి సెంటినలీస్ తమంతట తామే దాడికి దిగరు. వాళ్ల హెచ్చరికలను కూడా వినకపోతేనే దాడి చేస్తారు. పరిశోధనల్లో భాగంగా చాలా నెలలు అక్కడ ఉన్నారు. తర్వాత బయట ప్రపంచానికి వద్దామనుకున్న సమయంలో వారు ఇప్పుడు వెళ్ల వద్దు వర్షం వస్తది అని చెప్పారట. అప్పటి వరకు ఎండగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం పడింది. అంటే ప్రకృతికి వారు ఎంత దగ్గరగా ఉన్నారో అర్థమవుతుంది. సెంటినలీస్ ఆచారాలు వింతగా కూడా ఉంటాయి. వారిలో ఎవరైనా చనిపోతే వారి ఆకారాన్ని ఓ చెక్క బొమ్మ రూపంలో తయారు చేస్తారట. వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి ఆ చెక్క బొమ్మ ముందు పెడతారట. 1999లో సెంటినలీస్(North Sentinel Island)కు మదుమాల కలిసి నప్పుడు ఆమెను మిలాలే..మిలాలే అని పిలిచారంట. మిలాలే అంటే వారి భాషలో మిత్రులు అని అర్థం. అందరూ అనుకున్నట్టు వారు అంత ప్రమాదకరం కాదని కొన్ని సంఘటనలు రుజువు చేసినప్పటికీ, ఎందుకైనా మంచింది ఆ దీవికి వెళ్లకుండా ఉండటమే మంచిదని, వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదని చెబుతున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!