Noogler Benefits: ఉద్యోగం అంటే ఏదో నెలకు రూ.10 వేలు జీతం తీసుకునే మధ్యతరగతి కుటుంబాలు కోట్లలో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టతరమైనది. మరీ Amazon, walmart, టాటా స్టీల్ కంపెనీల్లో ఉద్యోగం అంటే ఇక దేవుడు వరమిచ్చినట్టే. ఇక ప్రపంచానికే టెక్నాలజీలకు తల్లి, గురువు అయిన గూగుల్ కంపెనీలో ఉద్యోగం అంటే ధనలక్ష్మి వడిలో పడినట్టే లెక్క.
అవును మంచిగా చదువుకోవాలే గానీ పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నాయి జాబ్‌లు ఇవ్వడానికి. మరో ప్రక్క ఆర్థిక మాద్యం నుంచి బయట పడటానికి కూడా అవే కంపెనీలు ఉద్యోగులను తొలగించడం విచారకరం. ఏది ఏమైనా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం దొరకడం వాటిల్లో మనం పనిచేయడం ఒక గోల్డెన్ ఛాయస్ అనే చెప్పుకోవాలి. అయితే అలాంటి కంపెనీలు ఉద్యోగుల పట్ల ఎలాంటి భద్రత కల్పిస్తున్నాయి?. ఎలాంటి వసతులు కల్పిస్తున్నాయి? అనేది కూడా ముఖ్యమే. ఇందులో భాగంగానే గూగుల్ ఉద్యోగులకు ఆ సంస్థ ఏ ఏ సదుపాయాలు Benefits, కల్పిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం!
Noogler Benefits: ఉద్యోగుల భద్రతే లక్ష్యం
గూగుల్ సంస్థలో పనిచేసే వ్యక్తులకు ఆ యాజమాన్యం చాలా శ్రద్ధ తీసుకుంటుందని ఒక ఉద్యోగి అనుభవ పూర్వకంగా నెటిజన్లతో పంచుకున్నారు. అతను ఉద్యోగంలో చేరిన తర్వాత తాను ఏం టీంలో పనిచేయాలనేది అతనికే ఛాయిస్ ఇస్తారంట. తర్వాత హెచ్ఆర్ మేనేజర్లతో మీటింగ్ జరుగుతుందట. ఆ మీటింగ్‌లో వారికి నచ్చిన టీంలో జాయిన్ అవ్వడానికి అనుమతి ఇస్తారంట.
సాధారణంగా కొన్ని కంపెనీల్లో జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని షరతులు ఉంటాయి. గతంలో పనిచేసిన కంపెనీతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలి. కొన్ని కంపెనీలు ఉద్యోగం మారిన వ్యక్తికి సెటిల్మెంట్ అయ్యేంత వరకూ జీతం ఇవ్వరు. కట్ ఆఫ్ డేట్ అయ్యాక అప్పుడు తర్వాత నెలలో జీతం ఇస్తారు. కానీ గూగుల్ మాత్రం కట్ ఆఫ్ మిస్ అయ్యిన వాళ్లకి తర్వాత నెల మొదటి వారంలోనే అడ్వాన్స్ శాలరీతో పాటు జాయినింగ్ బోనస్, రెలోకేషన్ కూడా ఇస్తుందట.
గూగుల్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో (Noogler Benefits) ఇంటి దగ్గర పనిచేసే వారు ఎక్కువగా ఉంటారు. వారికి ఆఫీస్ సెటప్ చేసుకునేందుకు 1000 డాలర్లు ఇస్తుందట. అంటే ఇండియా కరెన్సీలో అక్షరాల రూ.74,843 అన్నమాట. ఇక రీయింబర్సు మెంటు క్లెయిమ్ చేసుకుంటే రెండ్రోజుల్లో అన్ని అప్రూవల్స్ అయిపోయి డబ్బులు ఇస్తారంట. ఈ సంస్థలో జాబ్ సెక్యురిటీ ఎక్కువుగా ఉంటుందట. ఉద్యోగం చేసే వ్యక్తి ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా చూసుకుంటుందట Google. కొంతమందికి క్యాలెండర్లో థెరఫిస్ట్ అపోయిట్మెంట్ ఉచితంగా పెట్టేస్తారంట.


గూగుల్ సంస్థల్లో Insurance కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇందులో తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ కవర్ అవుతారంట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 7 గురుకు అవకాశం ఉంటుందట. డెంటల్ తో పాటు lasik సర్జరీ కూడా కవర్ అవుతుంది. ఈ సంస్థలో MVP కల్చర్ ఉండదట. పని చేస్తున్నప్పుడు లేట్ అయినా పర్లేదు కానీ, కరెక్ట్‌గా వర్క్ చేయాలంట.
Oncall సాధ్యమైనంత వరకూ ఉద్యోగులకు ఉండదట. ఒక వేళ ఇంటే దానికి అడిషనల్‌గా జీతం చెల్లిస్తారంట. కొత్తగా చేరిన ఉద్యోగులను గూగుల్ సంస్థలో Nooglers అంటారట. వీరికి కంపెనీ చాలా సపోర్టు చేస్తుందట. ట్రైనింగ్ సుమారు 2 నెలలు ఉంటుందట. ఒక ఉద్యోగికి ఇంతలా భద్రత కల్పించే గూగుల్ సంస్థలో ఉద్యోగం చేయాలనే ఎవరికి ఉండదు కదా!.