Naminations: ఏపీలో నామినేషన్ల జాతర ప్రారంభం
Naminations: ఏపీలో నామినేషన్ల జాతర ప్రారంభంVijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో 3249 గ్రామపంచాయతీలకు 32,504 వార్డులకు ఎన్నికలు జరగను న్నాయి. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నామి నేషన్లు స్వీకరణ జరుగుతుంది. జనరల్ సర్పంచ్ అభ్యర్థులకు రూ.3 వేలు, రిజర్వుడు సర్పంచ్ అభ్యర్థులకు రూ.1500, జనరల్ వార్డు మెంబర్లకు రూ.1500, రిజర్వుడ్ వార్డు మెంబర్లకు రూ.500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. నామినేషన్ల తుది గడువు జనవరి 31 తో ముగి స్తుంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన శనివారం నుండి ప్రారంభమవుతుంది.

ఈ నెల 31 ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన జరుగు తుంది. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసం హరణకు తుది గడువు ముగిస్తుంది. ఫిబ్రవరి 9న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వెల్లడి అదే రోజు ఉంటుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాల అనంతరం ఉపసర్పంచ్‌ల ఎన్నికల అదే రోజు ఉంటుంది.
Naminations: తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే రెవెన్యూ డివిజన్లు
శ్రీకాకుళం జిల్లా – శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ
విశాఖపట్టణం జిల్లా – అనకాపల్లి
తూర్పుగోదావరి జిల్లా – కాకినాడ, పెద్దాపురం
పశ్చిమగోదావరి జిల్లా – నర్సాపురం
కృష్ణాజిల్లా – విజయవాడ
గుంటూరు జిల్లా – తెనాలి
ప్రకాశం జిల్లా – ఒంగోలు
నెల్లూరు జిల్లా – కావలి
కర్నూలు జిల్లా – నంద్యాల, కర్నూలు
అనంతపురం జిల్లా – కదిరి
కడప జిల్లా – జమ్మలమడుగు, కడప, రాజంపేట
చిత్తూరు జిల్లా – చిత్తూరు.
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపు
ఇది చదవండి:రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్