Nobel Prize award డైనమెట్‌ను కనిపెట్టిన ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈ నోబెల్ బహుమతి ప్రదానానికి అంకురార్పణ చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ బహుమతిగా గౌరవింపబడుతున్నదీ నోబెల్ ప్రైజ్. మానవ జాతికి తాము అందించిన విశిష్ట సేవలను చిహ్నంగా ఈ బహుమతి ప్రదానం జరుగుతుంది. బహుమతి గ్రహీతకు ప్రపంచంలోనే ఒక గొప్ప హోదా దక్కుతుంది. 1901వ సంవత్సరంలో ఏర్పడిన ఈ బహుమతి ప్రధాన విధానం భౌతిక శాస్త్రం(ఫిజిక్స్), రసాయన శాస్త్రం (కెమెస్ట్రీ), శరీరశాస్త్రం/ వైద్య చికిత్స(ఫిజియాలజీ/ మెడిసిన్), సాహిత్యము (లిటరేచర్) మరియూ శాంతి (పీస్)లకు గానూ, అత్యంత నిగ్ణాతులు, ప్రసిద్ధ సేవలకులకు గుర్తింపుగా (Nobel Prize award)గౌరవించడం కోసం ఏర్పడినది.


ఆర్థికశాస్త్ర విజ్ఞానంలో బహుమతిని స్విరిజెస్ రిక్స్‌బ్యాంక్ (Sveriges Riks Bank of Sweeden) స్వీడన్‌కు చెందిన ఒక బ్యాంకు వారు 1968 లో సంస్థాపించారు. ఈ స్థాపన ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మార్కార్థమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహుమతి చిహ్నంగా ఒక మెడల్ (పతకం), ఒక వ్యక్తిగత ప్రశంసా పత్రము మరియూ, బహుమతి సొమ్ము బహుమతి గ్రహీతకు ఇవ్వడం జరుగుతుంది.
కొంతకాలం తర్వాత ఈ బహుమతి ప్రదానానికి సంబంధించిన నిబంధనలలో మార్పులు జరిగాయి. ఉదాహరణకు ప్రధమ దశలో బహుమతి సొమ్మును ముగ్గురు కన్నా ఎక్కువ మందికి పంచడం జరిగేది. 1968లో నోబెల్ ఫౌండేషన్ నిబంధనలలో 4వ అంశం బహుమతి ముగ్గురుకు పరిమితం చేస్తూ, అధికులకు పంచకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక మరణానంతరం కూడా ఈ బహుమతి ప్రదానం జరపవచ్చునని కూడా నిబంధన రూపొందించబడింది. అయితే అలా బహుమతి ఇవ్వవలెనంటే ప్రతిపాదన అదే సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీలోగా జరిగి ఉండాలి. ఈ నిబంధన 1947లో మార్పు జరిగింది. సర్వసాధారణంగా అక్టోబర్ నెలలో బహుమతి ప్రదానం జరుగుతుంది.


కాబట్టి ఆ సంవత్సరం బహుమతికరణం ఎన్నిక అయిన వ్యక్తి ఆ సంవత్సరం డిసెంబర్ నెల 10వ తేదీలోగా మరణించినా బహుమతి పొందే అర్హత కలిగి ఉంటాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 10వ తేదీన బహుమతి ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా నోబెల్ బహుమతి గ్రహీత అనగానే అతను తప్పకుండా విజ్ఞాన శాస్త్రవేత్త(సైంటిస్టు) అయివుంటాడనే భావన మనుసులో మెదలవుతుంది. సహజంగా సాహిత్యవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్రపంచ శాంతి దూతలను, గుర్తుంచుకునే జనం అరుదుగా ఉంటారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!