no cow milk: సార్ నా గేదె పాలు ఇవ్వ‌డం లేదు! కంప్లెంట్ తీసుకోండి!

no cow milk: త‌న గేదె పాలు ఇవ్వ‌డం లేద‌ని గేదెతో స‌హా పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేశాడు ఓ రైతు. ఈ వింత సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. రైతు ఫిర్యాదు స్వీక‌రించిన అధికారులు స‌మ‌స్య‌ను ప‌రిష్కరించారు. వివ‌రాల్లోకి వెళితే అప్ప‌టి వ‌ర‌కూ రోజుకు సుమారు 5 లీట‌ర్లు పాలు ఇచ్చే గేదె అక‌స్మాత్తుగా మానేయ‌డంతో ఆ రైతు కంగుతిన్నాడు. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోరుతూ చుట్టు ప్ర‌క్క‌ల వారిని అడిగితే వారు అత‌డిని ఆట‌ప‌ట్టించేందుకు పోలీసు స్టేష‌న్‌కు వెళ్ల‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. దీంతో ఆ రైతు పోలీసు స్టేష‌న్ కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో అత‌డిని నుంచి ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు ఆ రైతు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. ఎలా ప‌రిష్క‌రించాని (no cow milk)ఆశ్చ‌పోతున్నారా? అయితే చ‌ద‌వండి.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బింద్ జిల్లాకు చెందిన బాబూరామ్ అనే వ్య‌క్తి త‌న స్వ‌గ్రామంలో వ్య‌వ‌సాయం చేసుకుంటూ కుటుంబ స‌భ్యుల‌ను పోషించుకుంటున్నాడు. ఆయ‌న‌కు ఓ గేదె కూడా ఉంది. ఆ గేదె కొద్ది రోజులు క్రిత‌మే దూడ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో బాబూరామ్ రోజూ సుమారు ఐదు లీట‌ర్ల పాల‌ను ఆ గేదె నుంచి సేక‌రించేవాడు. అయితే శుభ‌కార్యం నిమిత్తం రెండ్రోజుల‌పాటు ప‌క్క‌న ఉన్న ఊరికి వెళ్లొచ్చే స‌రికి, అక‌స్మాత్తుగా గేదె పాలు ఇవ్వ‌డం మానేసింది. దీంతో ఒక్క‌సారిగా బాబూరామ్ కంగుతిన్నాడు.

చుట్టుప‌క్క‌ల వారికి స‌మ‌స్య‌ను చెప్పి, ప‌రిష్కారం అడిగాడు. అయితే వారు అత‌డిని ఆట‌ప‌ట్టించే ఉద్దేశంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే బాబూరామ్ పోలీసు స్టేష‌న్‌కు వెళ్లాడు. గేదెను కూడా పోలీస్ స్టేష‌న్‌కు తోలుకు వెళ్లాడు. త‌న గేదెకు ఎవ‌రో చేత‌బ‌డి చేసి ఉంటార‌ని, అందుకే పాలివ్వ‌డం లేద‌ని తెలిపాడు. చేత‌బ‌డి జ‌రిగిన విష‌యాన్ని గ్రామ‌స్తులు కూడా బ‌ల‌ప‌రుస్తున్నార‌ని వివ‌రించాడు. ఈ విష‌యంలో పోలీసులే త‌న‌కు సాయ‌ప‌డాల‌ని అర్జించాడు.

గేదె పాలివ్వ‌డం లేదంటూ త‌మ‌కు ఫిర్యాదు అందిన విష‌యం డిఎస్పీ వ‌ర‌కు వెళ్లింది. దీనిపై డీఎస్పీ అర్వింద్ షా స్పందిస్తూ, అత‌ని స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని వెల్ల‌డించారు. అత‌డికి ప‌శువైద్యుడి ద్వారా స‌ల‌హాలు అందించే ఏర్పాట్లు చేయాల‌ని పోలీసు సిబ్బందికి సూచించామ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో త‌న గేదె పాలు ఇస్తోందంటూ ఆ రైతు ఈ ఉద‌యం పోలీసు స్టేష‌న్ కు వ‌చ్చి చెప్పాడ‌ని డిఎస్పీ వివ‌రించారు.

Share link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *