Nithin new movie check Telugu movie release date | 19న నితిన్ కొత్త సినిమా ‘చెక్’ విడుదల
Nithin new movie check Telugu movie release date
నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చెక్ చిత్రం విడుదల తేదీ ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 19న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నామని నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ ప్రకటించాఉ. ఈ సందర్భంగా చెక్ సినిమా నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘జైలు నేపథ్యంలో రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ కథ ఇది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన సారాశం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్ – చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ క్లిప్‌కు మంచి స్పందన లభించింది. చెక్ సినిమాలో కథానాయకులుగా రకుల్ప్రీతీ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.’ అని తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో నితిన్ 2002 సంవత్సరంలో తొలి సినిమా జయం ద్వారా సంచలన విజయం అందుకున్నారు. ఆ తర్వాత దిల్ సినిమా 2003 సంవత్సరంలో సూపర్ హిట్ కొట్టింది. అదే ఏడాది సంబరం, 2004లో శ్రీ ఆంజనేయం సినిమాలు కాస్త యావరేజ్‌గా హిట్ అయ్యాయి. 2004లో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తో హీరో నితిన్ యూత్‌కు మరింత దగ్గరయ్యారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత హీరో కొన్ని సినిమాలు తీసినప్పటికీ అంతగా విజయం పొందలేదు. అనంతరం 2012లో వచ్చిన ఇష్క్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందులో పాటలు యూత్‌ను ఉర్రూత లూగించాయి. 2013లో గుండెజారి గల్లంతైయ్యిందే మూవీతో హీరో నితిన్ రేంజ్ భారీగా పెరిగింది. వరుస విజయాలలో 2014లో హార్ట్ ఎటాక్ , 2017లో లై సినిమా, 2018లో అ..ఆ, 2020లో భీష్మ సూపర్ హిట్‌ను అందుకున్నాయి. తాజాగా ఈ 2021 సంవత్సరంలో చెక్ సినిమా ద్వారా హీరో నితిన్ ప్రేక్షకులను అలరించనున్నారు.
ఇది చదవండి : బెదిరింపులకు భయపడేవాళ్లం కాదు!
ఇది చదవండి : నా విజయం వెనుక అమ్మ ఉంది
ఇది చదవండి : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి : నకిలీ మిరపనారు..లబోదిబోమంటున్న రైతన్నలు