Nindu Punnami Vela Song: కార్తిక్ రెడ్డి-లాస్య స్మైలీ జంటగా నటించిన తెలంగాణ జానపదం సాంగ్ 2022 నిండు పున్నమి వేళ..అంటూ అందర్నీ ఆకట్టుకుంటోంది. గత ఆగష్టు 2022లో సుమన్ ఫోక్ మ్యూజిక్ ఛానెల్‌లో విడుదలైన ఈ సాంగ్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ఈ సాంగ్ ను ఇప్పటికీ యూట్యూబ్‌లో ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు.
నిండు పున్నమి వేళ..అంటూ వచ్చిన ఈ పాటను Suman Badanakal లిరిక్స్ రాయడంతో పాటు పాడారు.నటించారు. సుమన్‌తో పాటు శ్రీనిధి కూడా తన స్వరాలను అందించింది. ఈ పాటకు కళ్యాన్ కీస్ అందమైన సంగీతం అందించారు. సురేష్ సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సాంగ్ సాహిత్యంతో పాటు, నటన, మ్యూజిక్ అంతా బాగుందని కామెంట్లు పెడుతున్నారు.
Nindu Punnami Vela Song కార్తీక్ రెడ్డి-లాస్య స్మైలీ జంట తమ నటనతో ఆకట్టుకున్నారు. పక్కా పల్లెటూరు వాతావరణంలో కొనసాగిన ఈ పాట చిత్రీకరణ చాలా బాగుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఇద్దరి ప్రేమికుల మధ్య సాగే ప్రేమను అందంగా కథ రూపంలో పాటలో తెలిపిన విధానాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఈ పాటలో సంగీతం పాటకు అద్దినట్టు వినుసొంపుగా ఉంది. పాటను సుమన్ బాధనకల్ ప్రాణం పెట్టి పాడినట్టు తెలుస్తోంది. ఈ పాటను Youtube లో విన్నవారంతా సుమన్‌ను ఇంత మంచి పాటను అందించినందుకు మెచ్చుకుంటున్నారు. ఈ పాటను హెడ్‌సెట్ పెట్టుకొని వింటుంటే ఆ లోకమే వేరుగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
ఈ పాటలో ప్రతి పదమూ గుండెకు హత్తుకునేలా అర్థమయ్యేలా రాశారు. ఒక అందమైన అమ్మాయిని అందంగా పొగడటం ఈ పాటలో మనం వినవచ్చు. అదే స్టైల్లో తనను ప్రేమించే అబ్బాయిని ప్రేమతో బెదిరించే మాటలు చాలా వినుసొంపుగా ఉంటాయి. ఈ పాటలో ప్రకృతిని అనుసరిస్తూ అమ్మాయిపై ప్రేమను వర్ణించే విధానం బాగుంది.
నిండు పున్నమి వేళ ముద్దుగా నవ్వేటి..అంటూ వస్తున్న ఈ పాటను ఎంత సేపు విన్నా బోరు కొట్టకుండా ఉంటుందని, పాట చాలా సూపర్‌గా ఉందని అంటున్నారు విన్నవాళ్లంతా. మరికొంత మంది ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందని, ఈ పాటను వింటుంటే నా మరదలు గుర్తుకు వస్తుందని కామెంట్లు పెడుతున్నారు.
పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చిన ఈ పాటను సుమన్ చాలా అందంగా కంపోజ్ చేశారు.ఈ పాట కోసం వారు పడిన కష్టంకు విజయం చేకూరిందని చెప్పవచ్చు. ఈ పాటలో సాహిత్యంపైన లిరిక్స్‌పై మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. పాటలోని భావం మరియు రాగం చాలా అందంగా ఉన్నాయని అంటున్నారు. అచ్చమైన తెలుగు అమ్మాయి, అబ్బాయిలకు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదేనేమో అన్నంతలా చూపించారని కామెంట్లు పెడుతున్నారు.
Nindu Punnami Vela Song Credits:
Song Name | Nindu Punnami Vela (Folk Song 2022) |
Lyrics | Suman Badanakal |
Singers | Suman Badanakal & Srinidhi |
Music | Kalyan Keys |
Casting | Suman Badanakal, Karthik Reddy, Lasya Smily |
Youtube video song | link |