AP స్థానిక ఎన్నికల వార్ : జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)నిమ్మగడ్డ రమేష్ కుమార్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఒక ప్రక్క ఎన్నికలకు సంబంధించిన పనులు త్వరత్వరగా జరుగుతూనే, మరోప్రక్క రాష్ట్రంలో పొలిటికల్ వార్ రోజురోజుకూ హీటెక్కుతుంది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత దూకుడు పెంచిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వేగాన్ని మరింత పెంచినట్టు తెలుస్తోంది. రెండురోజుల కిందట అధికారులపై హూంకరించిన ఎస్ఈసీ ఇప్పుడు ఏకంగా సీఎంఓనే టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.
సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, సీఎం క్లోజ్ సర్కిల్లో ఉండే సజ్జల రామకృష్ణారెడ్డిల పై చర్యలకు ఆదేశిస్తూ లేఖలు రాశారు. ఇక సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ఎంపీ విజయసాయి రెడ్డి పేర్లను లేఖలో ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ వ్యూహం మీద కసరత్తు చేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటి వరకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా కింది స్థాయి అధికారులపై చర్యల అస్త్రాలు సంధిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు లక్ష్యం దిశ మార్చినట్టు తెలుస్తోంది.
AP స్థానిక ఎన్నికల వార్ : తాడేపల్లి క్యాంపుపై గురి?
ప్రస్తుతం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంపై గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యకార్యదర్శి, సీఎంఓలో పవర్ ఫుల్ అధికారిగా పేరున్న ప్రవీణ్ ప్రకాశ్పై సీఎస్ ఆదిథ్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. తాను నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాకుండా ప్రవీణ్ ప్రకాశ్ అధికారులను ప్రభావితం చేశారని, తన రహస్య విచారణలో తేలిందని లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఏ అధికారితోనూ మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన మరో వివాదస్పద అడుగు, ప్రభుత్వ రాజకీయ సలహాదారు, సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ హోదా పొందుతూ పార్టీ వేదికగా తనపై రాజకీయ దాడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని ఫిర్యాదులో కోరారు. ఇలా ప్రభుత్వానికి, ఎన్నికల అధికారికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదం తెరలేవడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇది చదవండి: ఏపీలో నామినేషన్ల జాతర ప్రారంభం
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపు
ఇది చదవండి:రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్