Nimmagadda Ramesh Kumar VS YSRCP Government Political War | ముదురుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల “రాజ‌కీయ” పంచాయ‌తీ

Spread the love

Nimmagadda Ramesh Kumar VS YSRCP Government Political War

Amaravathi: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కు వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఎన్నిక‌ల వార్ కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌లు పెట్టాల‌ని ప‌లు మార్లు ఎస్ఈసీ ప్ర‌భుత్వానికి తెలియ‌జేయ‌గా, వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం క‌రోనా ఉంద‌ని, వ్యాక్సిన్ వేస్తున్నామ‌ని, ప్ర‌జారోగ్య‌మే ముఖ్య‌మ‌ని ప‌లుమార్లు కోర్టు మెట్లు ఎక్కి స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌లు వాయిదా వేసుకుంటూ వ‌స్తోంది. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎన్నిక‌ల విష‌యంలో చూపిస్తున్న ఉత్సాహం తెలుగు దేశం పార్టీని గెలిపించ‌డం కోస‌మేన‌ని, మాజీ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు క‌నుస‌న్న‌ల్లో ర‌మేష్ కుమార్ ప‌నిచేస్తున్నార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరోపిస్తూ విమ‌ర్శ‌లు చేస్తోంది.

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో జ‌రిగే యుద్ధం కంటే, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ తో జ‌రిగే రాజ‌కీయ యుద్ధ‌మే ఎక్కువుగా ఉంది. కొన్ని నెల‌లుగా కొన‌సాగుతున్న స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ పంచాయ‌తీ వాయిదాల ప‌ర్వంతో ముగిసిపోతుంది. కానీ ఈ సారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఎన్నికలు పెట్టే తీరుతాన‌ని అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంకు చివ‌రికి కోర్టులో షాక్ త‌గిలింది. రేపో మాపో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ అమ‌లు చేసే అవ‌కాశం ఉంది. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఎన్నిల‌కు వాయిదా వేయాల‌ని సూచిస్తోంది.

Nimmagadda Ramesh Kumar

ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేము: సీఎస్‌

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి లేద‌ని సీఎస్ ఆదిత్య‌నాథ్‌దాస్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌కు సీఎస్ లేఖ రాశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని ఆయ‌న లేఖ‌లో కోరారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ లో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్ అవ‌స‌రం. మొద‌టి డోస్‌కు, రెండో డోస్‌కు 4 వారాల వ్య‌వ‌ధి అవ‌స‌రం. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే తెలిపింది. మొద‌టి ద‌ఫా వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యాక‌, 60 రోజుల త‌ర్వాత ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి సిద్ధంగా ఉన్నాం. అని సీఎస్ ఆదిత్య‌నాథ్ లేఖ‌లో పేర్కొన్నారు.

తొలి విడ‌త‌లోనే ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ కు వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రని కేంద్రం చెప్పింద‌న్నారు. ఇప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వ‌డం సాధ్యం కాదని సీఎస్ తెలిపారు. ఇలా చేస్తే కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్టేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లు రెండు స‌జావుగా జ‌ర‌గాల‌ని హైకోర్టు సూచించింద‌న్నారు. హైకోర్టు ఆదేశాల‌ను పాటించాల్సిన దృష్ట్యా ఎన్నిక‌ల షెడ్యూల్‌ను వాయిదా వేయాల‌ని సీఎస్ ఆదిత్య‌నాథ్‌దాస్ లేఖ‌లో పేర్కొన్నారు.

తొమ్మిది మంది అధికారుల తొల‌గింపు

ఏపీ పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎస్ఈసీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. స్థానిక ఎన్నిక‌ల విధుల నుంచి తొమ్మిది మంది అధికారుల‌ను త‌ప్పిస్తూ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్ద‌రు క‌లెక్ట‌ర్లు, ఎస్పీ, ఇద్ద‌రు డీఎస్పీలు, న‌లుగురు సీఐలు ఉన్నారు. ఈ మేర‌కు త‌ప్పించిన అధికారుల వివ‌రాల‌ను సీఎస్ ఆధిత్య‌నాథ్ దాస్‌, డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌కు ఎస్ఈసీ లేఖ ద్వారా పంపించారు.

ఎన్నిక‌ల కోడ్ అమల్లోకి..

ఎన్నిక‌ల‌ను ఎవ‌రైనా అడ్డుకోవాల‌ని చూస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ హెచ్చ‌రించారు. క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు పూర్తి అధికారులు ఇచ్చామ‌న్నారు. ఇప్ప‌టికే పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఆల‌స్య‌మైంద‌న్నారు. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే గ్రామ‌స్థాయి పాల‌న స‌క్రమంగా జ‌రుగుతుంద‌న్న ఉద్ధేశంతో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. మోడ‌ల్ కాండ‌క్ట్ ఆఫ్ కోడ్‌ను అతిక్ర‌మిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ తెలిపారు.

సుప్రీంకోర్టులో వైసీపీ ప్ర‌భుత్వానికి షాక్‌

ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటీషన్ మొత్తం త‌ప్పుల త‌డ‌క‌గా ఉంద‌ని, దానిని స‌రిచేయాల‌ని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేప‌థ్యంలోనే పిటీష‌న్ ను వెన‌క్కిచ్చేసింది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ శుక్ర‌వారం రోజే రిజిస్ట్రీ పిటీష‌న్ ను స‌రిచేసి దాఖ‌లు చేయలేక‌పోవ‌చ్చ‌ని వైసీపీ లాయ‌ర్లు చెబుతున్నారు. దీనివ‌ల్ల సోమ‌వారం వ‌ర‌కు పిటీషన్ దాఖ‌లు చేసేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. అయితే పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ మాత్రం ఆదివార‌మే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ పిటీష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం లేనేట్లేన‌ని తెలుస్తోంది.

ఇది చ‌ద‌వండి : బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!
ఇది చ‌ద‌వండి : నా విజ‌యం వెనుక అమ్మ ఉంది
ఇది చ‌ద‌వండి : న‌ల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం
ఇది చ‌ద‌వండి : న‌కిలీ మిర‌ప‌నారు..ల‌బోదిబోమంటున్న రైత‌న్న‌లు

ఇది చ‌ద‌వండి: 19న నితిన్ కొత్త సినిమా ‘చెక్’ విడుద‌ల‌

ఇది చ‌ద‌వండి: గ్రామాల‌కు సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త‌

ఇది చ‌ద‌వండి: క‌స్ట‌మ‌ర్లగా వ‌చ్చారు. కోట్ల‌లో లూటీ చేశారు!

SP Ravindra Babu : స‌మ‌స్యాత్మ‌క గ్రామాల్లో ప‌ర్య‌టించిన ఎస్పీ ర‌వీంద్ర‌బాబు

SP Ravindra Babu : Gudivada: కృష్ణాజిల్లా గుడివాడ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో కృష్ణా జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌బాబు శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల Read more

Local panchayat elections : టీచ‌ర్ల‌ను ఇవ్వండి..ఓట్లేస్తాం..!

Local panchayat elections : టీచ‌ర్ల‌ను ఇవ్వండి..ఓట్లేస్తాం..! Visakapatnam: విశాఖ‌ప‌ట్టణం జిల్లా గూడెం కొత్త‌వీధి మండ‌లం ధార‌కొండ గ్రామ‌స్థులు కొత్త‌గా ఆలోచించారు. త‌మ గోడు ప‌ట్టించుకోని అధికారులు Read more

Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు!

Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు! Razole:  తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మ‌గ‌ట‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌కు Read more

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి Nandigama : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ అటు వైస్సార్‌సీపీలోనూ, ఇటు టిడిపి పార్టీలోనూ Read more

Leave a Comment

Your email address will not be published.