Night Curfew అమ‌ల్లోకి వ‌చ్చింది! అంతా నిర్మానుష్యం!

Night Curfew అమ‌ల్లోకి వ‌చ్చింది! అంతా నిర్మానుష్యం!

Night Curfew : క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదువుతున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన నైట్ క‌ర్ఫ్యూ మంగ‌ళ‌వారం రాత్రి నుంచి అమల్లోకి వ‌చ్చింది. రాజ‌ధాని హైద‌రాబాద్ స‌హా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దుకాణాల‌న్నీ వ్యాపారులు రాత్రి 8 గంట‌ల‌కే మూసివేశారు. హైద‌రాబాద్‌లో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట త‌దిత‌ర ఏరియాల్లో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు పాటిస్తూ వ్యాపారులు పెద్ద‌పెద్ద షాపింగ్ మాల్స్‌, చిన్న చిన్న దుకాణాలు అన్నీ మూత‌ప‌డ్డాయి. పంజాగుట్ట లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్‌, బంజారాహిల్స్ సిటీసెంట‌ర్‌, జీవీకే మాల్‌, సీనీమాక్స్ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. సినిమా థియోట‌ర్లు, ప‌బ్‌లు, బార్లు, మ‌ద్యం దుకాణాల‌ను కూడా రాత్రి 8 గంట‌ల‌కే మూసివేశారు. పోలీసులు రోడ్ల‌పై ప‌హారా కాస్తున్నారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌టికి రావొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు పోలీసు అధికారులు సూచిస్తున్నారు. క‌ర్ఫ్యూ అమల్లోకి రావ‌డంతో ప్ర‌జ‌లంతా తొలి రోజు స్వ‌చ్ఛందంగా అక్క‌డ‌క్క‌డా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు పూర్తి స్థాయిలో పాటిస్తున్నారు. తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రావ‌డంతో మ‌ళ్లీ పాత రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి.

మిన‌హాయింపులు వీటికే!

నైట్ క‌ర్ఫ్యూ నుంచి రాష్ట్రం కొన్ని అత్య‌వ‌స‌ర సౌక‌ర్యాలకు మిన‌హాయింపు ఇచ్చింది. అందులో అత్య‌వ‌స‌ర సేవ‌లు (108,104,100,101), పెట్రోల్ బంకులు, మెడిక‌ల్ షాపులు, డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్లు, ఆస్ప‌త్రులు, ప్రైవేటు సెక్యూరిటీ స‌ర్వీసులు, ఈ – కామ‌ర్స్ సేవ‌లు, ఆహార ప‌దార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లకు మిన‌హాయింపు ఇచ్చారు. ఇక విమాన‌, రైలు, బ‌స్సు ప్ర‌యాణికుల‌కు వ్యాలిడ్ టికెట్లు ఉంటే క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌నున్నారు. వైద్యం కోసం వెళ్లే గ‌ర్భిణులు, రోగుల‌కు కూడా మిన‌హాయింపు ఇచ్చారు. అంత‌రాష్ట్ర ర‌వాణాకు ఎలాంలి పాసులు అవ‌స‌రం లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

చ‌ద‌వండి :  Lockdown : ఒడిశాలో లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *