Night Curfew in Telangana : తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ?

By | April 15, 2021
Night Curfew

Night Curfew in Telangana : తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ?

Night Curfew : తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న నేప‌థ్యంలో బీఆర్కే భ‌వ‌న్ లో గురువారం అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారుతో సీఎస్ సోమేశ్ కుమార్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌కు సంబంధించిన అధికారుల నుంచి వివ‌రాల‌ను సోమేశ్ సేక‌రిస్తున్నారు.

అధికారుల‌తో స‌మావేశం ముగిస‌న త‌ర్వాత సీఎం కేసీఆర్ తో సీఎస్ భేటీ కానున్నారు. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నైట్ క‌ర్ఫ్యూ విధించే ఆలోచ‌న‌పై సీఎంతో కీల‌కంగా చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం.

అంతేకాకుండా పంట కొనుగోలు కేంద్రాల వ‌ద్ద తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌స్తున్న వారి ద్వారా వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా ఉండే జాగ్ర‌త్త‌ల‌పై సీఎం దృష్టికి సీఎస్ తీసుకెళ్ల‌నున్నారు.

మ‌రో వైపు దేవాల‌యాల వ‌ద్ద ర‌ద్ధీ, ఆల‌యాల్లో క‌రోనా పెర‌గ‌కుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేసీఆర్ తో సీఎస్ వివ‌రాల‌ను అడిగి తెలుసుకోనున్నారు. రంజాన్ మాసం నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డిపై అప్ర‌మ‌త్త‌త ఉండేలా సూచ‌న‌లు తీసుకోనున్నారు. కేసీఆర్ తో భేటీ అనంత‌రం సీఎస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రాత్రి లోపు తెలంగాణ‌లో నైట్ క‌ర్ఫ్యూ విధించాలా? వ‌ద్దా? అన్న దానిపై ఓ క్లారిటీ రానుంది.

cm kcr meeting (file)

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం!

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో క‌రోనా ప‌డ‌క‌ల‌ను మ‌రో 25 శాతం మేర పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో ఎలెక్టివ్ ఆప‌రేష‌న్ల‌ను వాయిదా వేయాల‌ని ఆదేశించింది. కోవిడ్ బాధితుల‌ను ఆస్ప‌త్రుల్లో చేర్చేందుకు ప్రొటోకాల్ రూపొందించే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల వివ‌రాల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఉన్న‌టువంటి 9,281 ప‌డ‌క‌ల‌కు 6,654 ఖాళీగా ఉన్నాయ‌ని తెలిపింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో 3,843 ప‌డ‌కులున్నాయి. వాటిలో 2,649 ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయ‌ని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

చ‌ద‌వండి :  IPS VK Singh : నేను పంజాబ్ వెళ్ల‌ను - భ‌గ‌త్‌సింగ్‌లా తెలంగాణ‌లోనే ఉంటాను!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *