ఏపీలో నేటి నుంచి Night Curfew అమ‌లు | ఆదేశాలు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు!

0
22
views

ఏపీలో నేటి నుంచి Night Curfew అమ‌లు | ఆదేశాలు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు!

Night Curfew : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా శ‌నివారం రాత్రి నుంచి క‌ర్ఫ్యూ అమ‌లు కానుంది. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. క‌ర్ఫ్యూ(Night Curfew)లో భాగంగా కార్యాల‌యాలు, వాణిజ్య సంస్థ‌లు, హోట‌ళ్లు మూసివే యాల‌ని ఆదేశాలు జారీ చేసింది ప్ర‌భుత్వం. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు, మీడియా, టెలికాం, ఇంట‌ర్నెట్‌, కేబుల్ సేవ‌ల‌కు, పెట్రోల్ బంకులు, విద్యుత్ సంస్థ‌ల కార్యాల‌యాలకు, నీటి స‌ర‌ఫ‌రా, పారిశుధ్య సేవ‌లు, ప్రైవేటు సెక్యురిటీ సేవ‌లు, ఆహార స‌ర‌ఫ‌రా సేవ‌ల‌కు మాత్ర‌మే క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌భుత్వం నిర్ధేశించిన రంగాల‌కు చెందిన వ్య‌క్తులు మిన‌హా మిగ‌తా వారంద‌రి రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అత్య‌వ‌స‌ర స‌ర‌కుల ర‌వాణా వాహ‌నాలు, అంత‌రాష్ట్ర స‌రుకు ర‌వాణాకు ఎలాంటి ఆంక్ష‌లు లేవ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ప్ర‌జా ర‌వాణాతో పాటు ఆటోలు ఇత‌ర వాహ‌నాలు నిర్ణీత క‌ర్ఫ్యూ వేళ‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే డిజాస్ట‌ర్ మేనేజ‌ర్ మెంట్ యాక్టు కింద క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట క‌ర్ఫ్యూతోపాటు నిబంధ‌న‌ల అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను ఆదేశిస్తూ ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది.

Share Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here