Nibba Nibbi

Nibba Nibbi: నిబ్బ-నిబ్బి ప‌దాల వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే!

Share link

Nibba Nibbi | తెలుగులోని హిందీలోని ఎక్కువుగా యూట్యూబ్‌లో క‌నిపించే ప‌దం నిబ్బా-నిబ్బి. ఈ ప‌దం పై youtube లో ప‌దుల సంఖ్య‌లో వీడియోలు ఉన్నాయి. అస‌లీ నిబ్బా, నిబ్బి(Nibba Nibbi) అంటే ఏమిటి? ఈ ప‌దం గురించి Google Search Engineలో రోజూ కొంద‌రు ప‌రిశోధ‌న చేస్తూనే ఉన్నారు. నిబ్బా-నిబ్బి ప‌దాల గురించి ప‌రిశోధ‌న చేయ‌గా వాటి అర్థం తెలియ‌క చాలా మంది తిక‌మ‌క ప‌డుతున్నారు. ఈ నిబ్బా అనే ప‌దాన్ని ఈ మ‌ధ్య కాలంలో Facebook, Instagram, పిన్‌రెస్ట్ లాంటి సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాంలో క‌నిపించ‌డం ఎక్కువ అయ్యింది.

ప‌రిప‌క్వ‌త లేని వ‌య‌స్సు

అయితే మాకు దొరికిన స‌మాచారం మేర‌కు నిబ్బా అంటే అమ్మాయి, అబ్బాయికి ప‌రిప‌క్వ‌త లేద‌ని అర్థంగా నిర్థారిస్తున్నారు యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహ‌కులు, ఈ ప‌దాలు వాడే వారు. వాస్త‌వానికి America దేశంలో ఈ ప‌దం ఒక బూతు అర్థాన్ని, సంకేతాన్ని సూచించే విధంగా అదే విధంగా ఇత‌రుల‌ను హేళ‌న చేసే విధంగా వాడుతుంటారు. ఇంగ్లీష్ కంట్రీస్‌లో ఆడ‌, మ‌గ వారు నిబ్బా అనే ప‌దాన్ని త‌రుచుగా వాడుతున్నారు. కాల క్ర‌మేణా అది అన్ని దేశాల‌కు పాకింది. ఈ నిబ్బా, నిబ్బిపై మ‌నుషుల ముఖం బ‌దులు పిల్లి ముఖంతో Memes చేసి జోకులు చేస్తున్నారు.

Tictok app అందుబాటులోకి వచ్చిన త‌ర్వాత ఈ ప‌దాలు మ‌రింత ప్రాచుర్యంలోకి వ‌చ్చాయి. టిక్‌టాక్‌లో వ‌య‌సు సంబంధం లేకుండా వీడియోలు, డైలాగులు చెప్ప‌డం, ల‌వ్ స్టోరీలు క్రియేట్ చేయ‌డం, 15 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌లు వ‌య‌సుకు మించిన వీడియోల్లో న‌టించ‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణ‌మైంది. నిబ్బ అంటే ఆడ‌వారికి, నిబ్బి అంటే మ‌గ‌వారికి అర్థం వ‌చ్చేలా మీమ్స్ త‌యారు చేస్తూ ఈ ప‌దాల‌ను సోషల్ మీడియాలో ఫార్వ‌ర్డ్ చేస్తున్నారు. ఈ ప‌దాలు గురించి ఒక ర‌కంగా చెప్పాలంటే ప్రేమ పైత్యం ముదిరి వ‌య‌సుకు సంబంధం లేని ప‌నులు చేయ‌డం అని చెప్ప‌వ‌చ్చు.

యూట్యూబ్‌లో కొకొల్ల‌లుగా వీడియోలు!

మీరు ఎప్పుడైనా యూట్యూబ్‌లో నిబ్బ‌- నిబ్బి అని ఇంగ్లీష్‌లో టైపు చేసి చూశారా? అలా కొట్టిన వెంట‌నే ఎన్నో వీడియోలు మ‌న ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అవి ఏమ‌న్నా ఉప‌యోగ‌ప‌డే వీడియోలు కాన‌ప్ప‌టికీ కాస్త న‌వ్వుకోవ‌డానికి మాత్రం, ఎంట‌ర్మైన్‌మెంట్ అందించటానికి ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఈ ప‌దాల మాటున ఇరుక్కు పోయి ఎంతో మంది తెలుగు పిల్ల‌లు కూడా యూట్యూబ‌ర్స్‌గా ట్రోల్స్‌గా, టార్గెట్‌గా మారారు. వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏది చేసినా వారి వీడియోల‌ను టార్గెట్ చేసి నిబ్బా, నిబ్బి పేరిట వీడియోలు త‌యారు చేసి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఇంకా లోతుగా విశ్లేషిస్తే 9వ త‌ర‌గ‌తిలోనే ప్రేమ వ్య‌వ‌హారాలు న‌డిపే పిల్లలు, 25 సంవ‌త్స‌రాలు వ‌య‌సు వారు చేసే, అనుభ‌వించే ప్రేమ వ్య‌వ‌హారాల స్టోరీల్లో స్కూల్ పిల్ల‌లు న‌టించి షార్ట్ ఫిలిమ్స్ తీయ‌డం, తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ప్రెగెన్నీ క్యారెక్ట‌ర్ల‌లో న‌టించ‌డం, మ‌గ‌వారు ఆడ‌వారుగా న‌టించ‌డం, వింతైన వేషాధార‌ణ‌తో సోష‌ల్ మీడియాలో యాక్ట్ చేయ‌డం లాంటి వారి గురించి మాత్ర‌మే నిబ్బా, నిబ్బి వీడియోల‌లో క‌నిపిస్తుంటారు. మ‌నిషి సాధ్యం కానిది ఏమీ లేన‌ప్ప‌టికీ ఈ ప‌దాల‌కు కూడా విలువ లేక పోయినా వాటి ప్రాధాన్య‌త పెంచి ఏకంగా యూట్యూబ్ ఛానెళ్ల‌ను న‌డిపే వారు లేక‌పోలేదు. నిత్యం ఈ ప‌దాలు ఇప్పుడు Trending yashtagsలో చేరిపోయి సోషల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి.

Nibba Nibbi Meaning Telugu: నిబ్బా నిబ్బి అంటే ఏమిటి?

Nibba Nibbi Meaning Telugu | ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న ప‌దం నిబ్బా , నిబ్బి. ఈ పదాల‌తో యూట్యూబ్‌లో, Read more

Husband abaddalu: మ‌గ‌వారు ఎక్కువుగా ఆడ‌వారితో చెప్పే 7 అబ‌ద్ధాలు ఇవేన‌ట‌?

Husband abaddalu | మ‌గ‌వారిలో, ఆడ‌వారిలో ఎవ‌రెక్కువ అబ‌ద్ధాలు చెబుతారో ఊహించండి? ఇంకెవ‌రు ఆడ‌వారంటారా? ఈ విష‌యం ఆడ‌వారితో ఇంకేమైనా ఉందా? కాదండోయ్‌.. ఆడ‌వారిక‌న్నా మ‌గ‌వారే ఎక్కువ Read more

Iron Cot: ఈ ఫొటోలో ఉన్న‌ది ఏమిటో గుర్తు ప‌ట్టారా? ఇక్క‌డ‌కు ఎలా వ‌చ్చింది?

Iron Cot | ఈ ఫొటో చూశారా? ఎవ‌రో ఈ మంచాన్ని అమాంతం ఎత్తుకెళ్లి చ‌క్క‌గా అక్క‌డ పెట్టినట్టు ఉంది క‌దూ. ఇంకా చెప్పాలంటే స‌ర్క‌స్ వారు Read more

Amazing Street Artist: నిజంగా ఆ చేతుల‌లో ఏదో Magic ఉంది | Suriname క‌ళాకారుడి నైపుణ్యం

Amazing Street Artist | కూటి కోసం కోటి విద్య‌లు అదే విధంగా కోటి తిప్ప‌లు ప‌డాల్సి వ‌స్తుంది ప్ర‌స్తుతం స‌మాజంలో. ఉన్న‌త చ‌దువులు చ‌దివినా job Read more

Leave a Comment

Your email address will not be published.