Nibba Nibbi Meaning Telugu | ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పదం నిబ్బా , నిబ్బి. ఈ పదాలతో యూట్యూబ్‌లో, ఫేస్బుక్లో, టిక్‌టాక్‌లో, ఇన్‌స్టాగ్రాంలో వీడియోలు పదుల సంఖ్యలో మనకు దర్శనమిస్తున్నాయి. నిబ్బా , నిబ్బి పదాలతో వీడియో హెడ్డింగ్‌లు పెట్టి నెటిజన్లను జోకులతో ఉబ్బి తబ్బిబ్బి అయ్యేలా చేస్తున్నారు. ఈ పదాలు ఎక్కడివి? వీటికి అసలు అర్థం ఏమిటి? అనే ప్రశ్న ఆ వీడియోలు చూస్తున్న, ఈ పదం చదివిన సగటు ప్రతి వ్యక్తికి వస్తున్న(Nibba Nibbi Meaning Telugu) సందేహం.
ఈ నిబ్బా నిబ్బి పదాలతో యూట్యూబ్‌లో ఏకంగా ఒక ఛానెల్నే నడుపుతున్నారు. అందులో కొన్ని వీడియో క్లిప్పులను ఒకచోట చేర్చి వాటికి మధ్యలో మీమ్స్ పెట్టి కోట్ల మంది వ్యూస్ ను సంపాదిస్తున్నారు. ఈ వీడియోలు ట్రెడింగ్ అవ్వడం వల్ల ఈ పదాలతో మరిన్ని పోస్టులు విడుదలవుతున్నాయి. నిజానికి నిబ్బా అనే పదం అర్థం పరిపక్వత లేని అబ్బాయి లేదా అమ్మాయి అని తెలుస్తంది. ఈ మధ్య స్కూలుకు వెళ్లే పిల్లలు ఎలాంటి అవగాహన లేకుండా పెద్ద పెద్ద లవ్‌స్టోరీలు, లవ్ పాటలు, ఇంటర్వ్యూలలో కనిపిస్తున్నారు.
కనీసం 18 సంవత్సరాలు రాని ఆడ, మగ పిల్లలతో లవ్ స్టోరీ తయారు చేసి యూట్యూబ్‌లోనూ, సోషల్ మీడియాల్లోనూ అప్లోడ్ చేస్తున్నారు. వీటిని పసిగట్టిన కొందరు యూట్యూబ్ ఛానళ్ల కుర్రకారు వారి వీడియోలతో నిబ్బా, నిబ్బి పేర్లతో ఒక రోస్టింగ్ వీడియోలను తయారు చేస్తున్నారు. వీటిని చూడటానికి బాగానే ఉండటంతో పాటు నవ్వు కూడా వస్తుంటుంది. దీంతో ఈ వీడియోలకు క్రేజీ పెరిగింది. కామెంట్లు వందల సంఖ్యలో వస్తున్నాయి.

అమెరికాలో నిబ్బా అనే పదం ఇతరులను హేళన చేసేందుకు తరుచుగా వాడుతుంటారంట. అక్కడ స్త్రీ, పురుషులు ఈ పదాన్ని మాత్రమే వాడేవారు. ఇప్పుడు నిబ్బా నిబ్బి పేర్లతో పిల్లి బొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. జోక్స్ వస్తున్నాయి. మీమ్స్ కూడా వచ్చేశాయి. ఈ నిబ్బా నిబ్బి వీడియోలు చూసిన వారు ఆ వీడియోలో ఉండే వారిని హేళనగా చూడటం ప్రారంభించారు. వారి వీడియోలు తెలివి తక్కువతనంగా భావిస్తున్నారు. ఈ నిబ్బా నిబ్బి వీడియోల్లో వేరే వారి యూట్యూబ్ వీడియోలతో చేస్తున్నారు. పాపం వారి వచ్చీరాని యాక్టింగ్, డైలాగులను ఆటపట్టిస్తున్నారు ఈ నిబ్బా వీడియోలు చేసేవారు, చూసేవారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!