Nibba Nibbi Meaning in Hindi: నిబ్బా నిబ్బి అనేది ఇప్పుడు తరచూ సోషల్ మీడియాల్లో చూస్తున్న, వింటున్న పదం. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రామ్ తదితర యాప్స్ వచ్చిన తర్వాత ఈ పదం మరింత నెటిజన్లకు చేరువైంది. ఈ నిబ్బా నిబ్బి పదాలతో అనేక ఫన్నీ వీడియోలు యూట్యూబ్‌లో కూడా చూస్తుంటాం.
Nibba Nibbi Meaning in Hindi: హిందీల్లో నిబ్బా-నిబ్బి అర్థం ఏమిటి?
నిబ్బా నిబ్బి అనే పదం ఏ భాషలోనూ సరైన అర్థం లేదని చెప్పవచ్చు. కానీ మనం అనుకున్న ప్రకారం ఈ పదాలకు అర్థం సరైన పరిపక్వత అంటే బుద్ధి పెరగక పోవడం అని మాత్రం తెలుసు. ఎక్కువుగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలు వారి వయసు మించి చేష్టలు చేస్తుంటారు. ముఖ్యంగా లవ్‌లో పడటం, మ్యారేజీ చేసుకోవడం, లవ్ ఫెయిల్యూర్‌తో బాధపడటం లాంటివి చేస్తుంటారు. ఒక యుక్త వయసు వచ్చినప్పుడు చేయాల్సిన పనులన్నీ ఈ 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలోనే చేసే చేష్టలనే నిబ్బా నిబ్బిగా చెబుతుంటారు.
టిక్-టాక్ (tiktok) యాప్ ఎక్కువుగా వాడుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఏదో ఒక రూపంలో యాక్ట్ చేసి వీడియో అప్‌లోడ్ చేసేవారు. అదే సమయంలో వయసుకు మించి చేసే వీడియోలను, అందులో నటించే వారిని ప్రత్యేకంగా జత చేసి ఫన్నీ రూపంలో నిబ్బా-నిబ్బి(Nibba Nibbi Meaning in Hindi) పేర్లతో సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలో వదిలారు. ఇక అప్పటి నుంచి నిబ్బా-నిబ్బి పేరు మీద ఎన్నో వీడియోలు, ఫొటోలు వస్తూనే ఉన్నాయి. నిబ్బా నిబ్బి పేరుతో తెలుగులో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలను కూడా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో.


నిబ్బా నిబ్బి (Nibba Nibbi Meaning) అంటే విదేశాలలో ఒక బూతు పదంగా కూడా పరిగణిస్తారు. ఇంకా విలువలేని అని అర్థం కూడా వస్తుంది. వాస్తవానికి అమెరికాలో నల్లజాతి ఆఫ్రికన్ ప్రజలను కించపరిచే విధంగా శ్వేతజాతీయులు వారిని నిగ్గా(Nigga) అని పిలిచేవారు. అంటే ఇది ఒక అవమానకరంగా భావించే పదం. ఇప్పటికీ అమెరికాలో ఈ పదాన్ని వాడుతున్నారని మనం వీడియోలు చూసినప్పుడు పలు ఘటనలు చూసినప్పుడు తెలుస్తుంది. నిబ్బా-నిబ్బి పదాల గురించి మొత్తంగా చెప్పాలంటే వయసుకు మించిన ఆలోచనలు, కార్యాలు చేయడం అని చెప్పవచ్చు.