NIA

NIA: Nursing స్టూడెంట్ను Maoistల్లో చేర్పించారా? మూడేళ్న త‌ర్వాత న్యాయ‌వాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

Spread the love

NIA | రాష్ట్ర రాజ‌ధాని హైదారాబాద్‌లో ప‌లువురు లాయ‌ర్లు, సామాజిక కార్య‌క‌ర్త‌ల ఇళ్ల‌ల్లో ఎన్ఐఏ గురువారం సోదాలు చేసింది. గ‌తంలో క‌నిపించ‌కుండా పోయిన న‌ర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యంపై విశాఖ ప‌ట్నంలో మిస్సింగ్ కేసు న‌మోదు కాగా, దాన్ని #ఎన్ఐఏకు బ‌దిలీ చేశారు. తెలంగాణ హైకోర్టు లాయ‌ర్ శిల్ప ఇంట్లో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వ‌హిన‌ట్టు తెలుస్తోంది. హైద‌రాబాద్ ఉప్ప‌ల్ ప్రాంతం చిలుకాన‌గ‌ర్లోని ఆమె నివాసంలో NIA అధికారులు గురువారం ఉద‌యం సోదాల చేశారు.

ఇటు మ‌రో అడ్వ‌కేట్ దేవంద్ర‌తో పాటుగా చేగుంట‌కు చెందిన ఓ సామాజిక కార్య‌క‌ర్త ఇంటిలోనూ సోదాలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే సోదాలు ముగియ‌గానే #Advocate Shilpa శిల్ప‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు గ‌చ్చిబౌలి కార్యాల‌యానికి త‌ర‌లించిన‌ట్టు తెలిసింది.

NIA: రాధ‌ను మావోయిస్టుల్లో చేర్పించారంటూ?

ఏపిలోని విశాఖ‌ప‌ట్నంలోని మూడేళ్లుగా క‌నిపించ‌కుండా పోయిన రాధ అనే న‌ర్సింగ్ విద్యార్థిని మావోయిస్టుల్లో చేర్చారంటూ శిల్ప‌తో పాటు దేవేంద్ర‌, మ‌రో సామాజిక కార్య‌క‌ర్త‌పై అభియోగాలున్నాయి. విశాఖ‌ప‌ట్నంలో మిస్సింగ్ కేసుగా న‌మోదైన ఈ కేసును తాజాగా #NIAకు అప్ప‌గించారు. విశాఖ పోలీసులు న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఐఏ అధికారులు శిల్ప‌, త‌దిత‌రుల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. త‌మ కూతురు రాధ‌ను కిడ్నాప్ చేశార‌ని, గ‌తంలో ఆమె త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయ‌కులు శిల్ప‌, దేవేంద్ర త‌దిత‌రులు రాధ‌ను కిడ్నాప్ చేసి బ‌ల‌వంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చార‌ని రాధ త‌ల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. #CMS నాయ‌కులు దేవేంద్ర‌, స్వ‌ప్న‌, హైకోర్టు న్యాయ‌వాది శిల్ప‌, త‌ద‌త‌రులు త‌మ నివాసానికి వ‌చ్చేవార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యం పేరుతో రాధ‌ను దేవేంద్ర తీసుకెళ్లిన‌ట్టు.. ఆ త‌ర్వాత త‌న కూతురు ఇంటికా రాలేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Maha Annadanam: ఖ‌మ్మం న‌గ‌రంలో Saibaba mandirలో మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం

Maha Annadanam | ఖ‌మ్మం న‌గ‌రంలో గురువారం Khanapuram హ‌వేలి విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ లో షిరిడీ Sai Baba మందిరం 15వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఉద‌యం నుండి Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.