NewsPaper Bags: ఈ భూ ప్రపంచాన్ని ఇప్పటికే కలుషితం చేశామనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఒక మనిషికి కావాల్సిన వనరులు కంటే అధికంగా ప్రకృతి నుండి తీసుకొని భవిష్యత్తు తరాలకు మరింత ఇబ్బంది కర పరిస్థితులను పరిచయం చేస్తున్నాం. ఇప్పటికే నీరు, నేల, గాలి అంతా కలుషితం అయ్యింది. ఇక నిత్యం వాడే ప్లాస్టిక్ పదార్థంతో భూ వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు వెలుగులోకి వస్తున్నాయో రోజూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తునే ఉంటున్నాం.
సముద్రాల్లో, నదుల్లో, పారే సెలయేరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సమస్థ జీవ ప్రాణులు ప్రాణాలకు ముప్పు పొంచి యున్నది. ఎన్నో జల జీవరాసులు ఈ ప్లాస్టిక్ వల్ల ప్రాణాలు కోల్పోయాయి. ఏళ్ల తరబడి అలానే ఉంటూ భూమిలో కలిసి పోని ప్లాస్టిక్‌పై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, ప్రభుత్వాలు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు సామాజిక సంఘ సేవకులు ప్లాస్టిక్‌ను నిర్మూలించే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్లాస్టిక్ బ్యాగులను, చేతి సంచులను వినియోగించకుండా నిషేధం కూడా విధిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పేపర్ తో తయారు చేసిన సంచులు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని తయారు చేసిన గొప్ప వ్యక్తి గురించి కొన్ని విషయాలు.
కర్ణాటక రాష్ట్రం కార్వార్కు చెందిన ధనంజయ్ హెగ్డే ఒక మహోతర్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చదివి మిగిలిన వార్తాపత్రికలతో న్యూస్ పేపర్ బ్యాగ్‌లను తయారు చేశారు. వారు తయారు చేసిన న్యూస్ పేపర్ బ్యాగ్‌లతో సుమారు 10 కేజీల బరువును సునాయసంగా మోసుకెళ్ల వచ్చునని చెబుతున్నారు.


ఈ న్యూస్ పేపర్ బ్యాగ్(చేతి సంచులు)ల తయారీలో మొక్కజొన్న పొడిని కలిపి తయారు చేస్తున్నారు. ఈ కాగితపు సంచులను చేతి ద్వారా కుట్టి పట్టుకునేందుకు వీలుగా తయారు చేశారు. ఈ పేపర్ తయారీలో మొక్కజొన్న పిండితో పాటు అరటి పైబర్, దారం ఉపయోగిస్తున్నారు. పూర్తిగా బయోఅధోకరణం చెందే ఈ సాధారణ కాగితంలో ఎటువంటి లీక్‌లు లేకుండా వాటర్ ఫ్రూఫ్ బ్యాగులుగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
ఇలాంటి కాగితపు సంచుల వల్ల వ్యాపారాలు చేసే వారు ఎలాంటి భయం లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తిగా పర్యావరణాన్ని కాపాడటంలో ఇవి ఎంతో దోహద పడతాయని అంటున్నారు. ఇలాంటి కాగితపు సంచులు మార్కెట్లో కూడా దొరకుతున్నాయి. ఒకటి, రెండు సార్లు వాడుకుని పారవేసినప్పికీ వీటితో ఎలాంటి కలుషితం లేదని ధనంజయ్ హెగ్డే అంటున్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!