News today AP | ఆంధ్రప్రదేశ్‌లోని సోమవారం వార్తలు కింద ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అమలాపురంకు మరో పేరు పెట్టాలని ముద్రగడ లేఖ, బ్లేడ్‌తో యవకుడి గొంతుకోసిన యువతి, ఏపీలో పంటలపై చర్చించిన సీఎం జగన్, విజయవాడలో యుటిఎఫ్ సెగ ఇలాంటి మరిన్ని వార్తలను (News today AP) కింద ఇవ్వడం జరిగింది.
సీఎం జగన్‌కు లేఖ రాసిన ముద్రగడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో New disttictsలకు సంబంధించి సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అమలాపురం జిల్లాకు బాలయోగి పేరు పెట్టాలని లేఖలో ఆయన కోరారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలోని కొత్త జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా Amalapuram జిల్లాకు బాలయోగి పేరు పెట్టాలని పలువురు నేతలు కూడా కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించే అవకాశముంది.
మొన్న యువతి…నేడు యువకుడు!
అనకాపల్లిలో నగేష్ అనే యువకుడు బ్లేడ్‌తో యువతి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో యువతి సొంత మేనమామ కొండబాబు ఈ కిరాతకం చేయించాడని అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓసారి యువతిపై నగేష్‌తో దాడి చేయించాడని సమాచారం. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి Kondababu ముఖం చాటేశాడని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు.
Organic ఎరువుల వైపు మళ్లాలి cm jagan
ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన cm jagan రసాయన ఎరువులతో కాకుండా సేంద్రీయ విధానాల వైపు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. 6.30 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2.9 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రైతుల్లో అవగాహన పెంచేందుకు Polambadi నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలు జరగాలని సీఎం జగన్ అన్నారు.
వేసవి సెలవులుపై వీర్రాజు సెటైరికల్ స్పందన
ఉపాధ్యాయులకు మే 20 వరకు సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సెలవుల రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. వేసవి సెలవులు వర్షాకాలంలో ఇస్తారా? మే 7వ తేదీతో టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు EL ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం డొంక తిరుగుడుగా వ్యవహరిస్తోంది అని వీర్రాజు ఫైరయ్యారు.
విజయవాడకు వెళ్లే Busలు నిలిపివేత
UTF ఆధ్వర్యంలో ఛలో సీఎంఓకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో విజయవాడకు వెళ్లే బస్సులను ఉదయం నుంచి అధికారులు నిలిపివేశారు. ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకున్నవారు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అటు విజయవాడ, పరిసర ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి.
CPSపై సరైన నిర్ణయం తీసుకుంటాం.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మంత్రి బొత్స అన్నారు. CPS విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. యూటిఎఫ్ సభ్యులు సీఎం ఇంటిని ముట్టడిస్తామనడం సరికాదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఉపాధ్యాయులపై కమిటీ వేశామని, ఆ కమిటీ అన్ని విషయాలను పరిశీలిస్తోందని తెలిపారు.
Road Accident లో నలుగురు మృతి
శ్రీకాళహస్తిలో జరిగిన హోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రగా గాయపడ్డారు. రేణిగుంట-నాయుడుపేట రహదారిపై మినీ వ్యాన్‌ను లారీ ఢీకొంటడంతో ఈ ప్రమాదం చోటు చేసుంది. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా Hospitalకి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.