News Telangana | తెలంగాణలో శుక్రవారం వార్తలు అందిస్తున్నాము. ఇందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులకు హైకోర్టు శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. యాసంగి పంటలపై మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్స్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతలు తదితర వార్తల(News Telangana)ను కింద చదవండి.
కాంట్రాక్టు ఉద్యోగులకు good news
తెలంగాణలో ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట లభించింది. కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయరాదని వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఇటీవల 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నెలలో ఆయా శాఖలు ప్రొసీడింగ్స్ జారీ చేశాయి. తాజాగా కోర్టు అడ్డంకులు తొలగడంతో త్వరలో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ కానున్నారు.
ప్రత్యేక రైళ్లు-సికింద్రాబాద్-తిరుపతి మధ్య
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 02764/02763 ట్రైన్ ఈ నెల 20,30, మే 7,14,21,28 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 6.40 కి బయలుదేరుతుంది. ఈ నెల 24, మే1,8,15,22,29 తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 5కు బయలుదేరుతుంది. మచిలీపట్నం-సికింద్రాబాద్ (07185/07186) స్పెషల్ ట్రైన్ ఈ నెల 24, మే 1,8,15,22,29, జూన్ 5,12,19,26 తేదీల్లో రాకపోకలు సాగించనుంది.
వారికి నచ్చిన పంటలు వేసుకోవచ్చు
వర్షాకాలం పంటలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రైతులు తమకు నచ్చిన పంటలు వేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము వరి వేయొద్దని చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే వరి కంటే ఇతర పంటలు లాభదాయంగా ఉండటంతో వాటివైపు మళ్లించేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కిరికిరి పెట్టడం వల్లే గతంలో ఇతర పంటలు వేయాలని సూచించినట్టు మంత్రి నిరంజన్ వెల్లడించారు.
metro రెండో దశకు రూ.5 వేల కోట్ల వ్యయం
తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రెండో దశకు ప్రణాళికలు రూపొందించామని, పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మార్గాన్ని నిర్మించేందుకు రూ.5 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు వెల్లడించారు. ఇందులో ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చని, covid వల్ల మెట్రోకు రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆయన తెలిపారు.
మరో 3 TIMSలకు పరిపాలనా అనుమతులు
తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్)లో భాగంగా హైదరాబాద్లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందబాటులోకి రానున్నాయి. మొత్తం రూ.2,679 కోట్లతో ఎల్బీ నగర్ (రూ.900 కోట్లు), సనత్ నగర్ (రూ.882 కోట్లు), అల్వాల్ (రూ.897 కోట్లు) లో ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక టిమ్స్ ఉండగా, కొత్త వాటితో Hyderabadకు నలువైపులా నాలుగు టిమ్స్లు అందుబాటులోకి రానున్నాయి.
ఉపాధ్యాయుల పదోన్నతులకు sarkar green signal
టిఎస్లో టీచర్లకు వెబ్ counselling ద్వారా బదిలీలు చేపట్టి, తర్వాత పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నూతన జిల్లాల సీనియార్టీ ప్రాతిపాదికన యాజమాన్యాల వారీగా head masterల స్థాయి వరకు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
మంత్రి KTRకు MP అరవింద్ సవాల్!
కేంద్ర నిధులపై మంత్రి కేటీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారని తెలంగాణ BJP ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. తంబాకు టెస్టుకు బండి సంజయ్ రెడీ.. ఆయనను నేను తీసుకొస్తా..కొకైన్ టెస్టుకు కేటీఆర్ రెడీనా అంటూ సవాల్ విసిరారు. బియ్యంను బ్లాక్ మార్కెట్కు తరించడంపై CBI విచారణ కోరే దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటూ ప్రశ్నించారు.
కొత్త G.O 69 చెల్లదంటున్న రేవంత్
తెలంగాణలో జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో 69 చెల్లదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కాపీని ట్వీట్ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు 111 జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ 2007 జూలై 16న హైకోర్టు స్టే విధించిందన్నారు. మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు చేసి ఆంక్షలు ఎత్తేశారని ఆరోపించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ