News Crime

News Crime: క్రైమ్ న్యూస్ లెటెస్ట్ అప్డేట్స్ శుక్ర‌వారం 22,2022

National

News Crime | ఈ రోజు క్రైమ్ వార్త‌ల‌ను కింద ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌ధాన అంశాల‌లో భాగంగా తెలంగాణ‌లో యువ‌తి గొంతు కోసిన ప్రేమోన్మాది, గ్యాంగ్ రేప్ కేసులో సీఐ,ఎస్సై స‌స్పెండ్‌, పోలీసు వాహ‌నాల తాళాల‌ను తీసుకెళ్లారు!, స‌రిహ‌ద్దులో న‌లుగురు టెర్ర‌రిస్టులు హ‌తం ఇలాంటి త‌దిత‌ర వార్త‌ల‌(News Crime)ను చ‌ద‌వండి!

యువ‌తి గొంతు కోసి ప్రేమోన్మాది

తెలంగాణ‌లో మ‌రో ప్రేమ వివాదం వెలుగు చూసింది. Hanmakondaలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కాక‌తీయ యూనివ‌ర్శిటీలో ఏంఏసీ చ‌దువుతున్న అనూష అనే యువ‌తిని అజ‌హార్ అనే య‌వకుడు ప్రేమించాలంటూ కొంత‌కాలంగా వేధిస్తున్నాడు. ఈ క్ర‌మంలో పోచ‌మ్మగుడి స‌మీపంలో అనూష‌పై క‌త్త‌తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల‌పాలైన ఆ యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యువ‌తి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

Gang Rape కేసులో సీఐ, ఎస్సై స‌స్పెండ్‌

విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో యువ‌తిపై సామూహిక అత్యాచారం కేసులో సీఐ హ‌నీష్‌, ఎస్సై శ్రీ‌నివాస‌రావుపై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. త‌మ కుమార్తె క‌నిపించ‌డం లేదంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించినా సీఐ, ఎస్సై ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై విమ‌ర్శ‌లు రావ‌డంతో సీఐ, ఎస్సైని స‌స్పెండ్ చేశారు.

పోలీసు వాహ‌నాల తాళాల‌ను తీసుకెళ్లారు!

ఉద్రిక్త‌త‌కు దారి తీసిన APPSC కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక‌త్త నెల‌కొంది. జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌కుండా ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు అన్యాయం చేస్తోందంటూ ఏపీ బీజేపీ, APPSC కార్యాల‌య ముట్ట‌డికి పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ యువ‌మోర్చా కార్య‌క‌ర్త‌లు కార్యాల‌యం వ‌ద్ద‌కు దూసుకొచ్చారు. నిర‌స‌న కారుల్ని అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. కోపంతో నిర‌స‌న‌కారులు పోలీసు వాహ‌నాల తాళం చెవుల్ని ఎత్తుకెళ్లారు.

న‌లుగురు టెర్ర‌రిస్టులు హ‌తం

జ‌మ్మూకాశ్మీర్‌లోని baramullaలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్టు ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్టు yusuf కంట్రూ కూడా ఉన్నాడ‌ని తెలిపారు. ఓ పోలీసు గాయ‌ప‌డ‌గా, చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. ప‌క్కా స‌మాచారంతో ప‌లు చోట్ల మ‌రిన్ని కూంబింగ్ ఆప‌రేష‌న్లు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌యాణికుడిను చిత‌క‌బాదిన mike tyson

బాక్సింగ్ దిగ్గ‌జం mike tyson ఓ ప్ర‌యాణికుడి మొహం ప‌గ‌ల‌గొట్టాడు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడాకు బ‌య‌లుదేరుతున్న విమానంలో టైస‌న్ వెనుక సీటులో కూర్చున్న ఓ ప్రయాణికుడు ప‌దేప‌దే త‌న మాటల‌తో టైస‌న్‌కు విసుగు తెప్పించాడు. అత‌డ్ని రెచ్చ‌గొట్టేలా కామెంట్స్ చేశాడు. టైస‌న్‌పై వాట‌ర్ బాటిల్ కూడా విసిరాడు. ఓపిక న‌శించిన టైస‌న్ ఆ ప్ర‌యాణికుడికి త‌న బాక్సింగ్ పంచ్‌లు రుచి చూపించాడు. దీంతో ఆ ప్ర‌యాణికుడు తీవ్ర గాయాల‌పాల‌య్యాడు.

స్కూళ్లు, కాలేజీల ద‌గ్గ‌ర drugs chocolate

చెన్నైలోని స్కూళ్లు, కాలేజీల స‌మీపంలో కిరాణా స్టోర్స్‌, సూప‌ర్ మార్కెట్ల‌లో డ్ర‌గ్స్ చాక్లెట్లు అమ్ముతున్నార‌నే వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వీటిపై ఫిర్యాదులు రావ‌డంతో అధికారులు ఆక‌స్మీక త‌నిఖీలు చేశారు. లేబుల్స్‌, గుర్తింపు లేని చాక్లెట్స్‌, జెల్లీస్‌, ఐస్‌క్రీమ్‌ల‌ను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కి పంపించారు. ఈ ఐట‌మ్స్ ఎక్క‌డ త‌యార‌వుతున్నాయి? దీని వెనుక ఎవ‌రున్నారు? అనే దానిపై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

DJ Soundకు వ‌రుడి తండ్రి గుండె ఆగింది

ఒడిశాలోని మ‌ల్కాన్‌గిరిలో విషాదం నెల‌కొంది. ఢిల్లీకి చెందిన అంకిత్‌, మ‌ల్కాన్ గిరికి చెందిన యువ‌తికి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కోసం వ‌రుడి కుటుంబీకులు మ‌ల్కాన్‌గిరికి రాగా, వారిని వ‌ధువు ఇంటికి గ్రాండ్‌గా తీసుకెళ్లేందుకు డీజే ఏర్పాటు చేశారు. అయితే డీజే స్టార్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా వ‌చ్చిన భారీ శ‌బ్ధానికి వ‌రుడి తండ్రి గుండెపోటుతో కుప్ప‌కూలి అక్క‌డికక్క‌డే మృతి చెందాడు.

ఇద్ద‌రు అధికారుల‌కు జైలు శిక్ష‌, జ‌రిమానా

కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో మాజీ రాజంపేట స‌బ్ క‌లెక్ట‌ర్ కేత‌న్ గార్డ్‌, ఏపీఎండీసీ సీపీఓ సుద‌ర్శ‌న్ రెడ్డిల‌కు ఏపీ high court 6 నెల‌ల జైలు శిక్ష‌, రూ.2 వేల జ‌రిమానా విధించింది. మైనింగ్ కోసం తీసుకున్న ఇంటిపి ప‌రిహారం చెల్లించ‌క‌పోవ‌డంతో బాధితురాలు కోర్టును ఆశ్ర‌యించ‌గా ప‌రిహారం చెల్లించాల‌ని న్యాయ‌స్థానం గ‌తంలో ఆదేశించింది. అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో బాధితురాలు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ వేయ‌గా, న్యాయ‌స్థానం ఈ తీర్పు ఇచ్చింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *