new year plans 2022 ఈ నూతన సంవత్సరం ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు? గడిచిన కాలం ఎలా ఉన్నామన్నది కాదు గాని నూతన సంవత్సరం మాత్రం భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అందరూ బాగుండాలనే ఆలోచిస్తాం కదా!. అదే విధంగా అసలు మనం ఎలా ఉంటే మనం బాగుంటాం? ఈ నూతన సంవత్సరం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి. అనే ఆలోచనకు ముందు మాత్రం ఇల్లు పరిశుభ్రత ఎలా ఉంది? మన ఆరోగ్యం ఎలా ఉంది? మన సంపాదన ఎలా ఉంది? అని ఆలోచిస్తే కాస్త గడిచిన కాలంలో కరోనా దెబ్బకు కకావికలమైన పరిస్థితే అందరి కుటుంబాల్లోనూ(new year plans 2022) కనిపిస్తుంది.
అయితే ఈ నూతన సంవత్సరం మాత్రం ఆధ్యాత్మిక వేత్తలు, సిద్ధాంతులు సూచిస్తున్న నియమాలు, నిబంధనలు పాటిస్తే మాత్రం ఈ నూతన సంవత్సరం 2022 (New Year 2022) మాత్రం అంతా శుభమే కలిసివస్తుందని చెబుతున్నారు. ఈ పద్ధతలు హిందూ సాంప్రదాయపరంగా ఉన్నప్పటికీ అందరికీ ఉపయోగపడే రీతిలో సైన్సు విలువలతో కూడిన ఈ పద్ధతలు అందరూ పాటించవచ్చు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే! ఆచరించడం…ఆచరించకపోవడం మీ ఇష్టం!. ఆ పద్ధతులు ఏమిటంటే?

ముఖ ద్వారం శుభ్రం!
మన ఇంటి లోపలకి వెళ్లే ముఖ ద్వారం దానికి గడప అని కూడా అంటాం. ఈ నూతన సంవత్సరంలో ఆ గడపు ముఖ ద్వారాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. అది తూర్పు, పడమర ఏ దిక్కులో ఉన్నా సరే ముందుగా ముఖ ద్వారంపై ఉన్న బూజును తొలగించాలి. వీలైతే కొత్త రంగులు, పూలు, మామిడి తోరణాలతో అలకరించుకోవాలి. ఇల్లు చూడు..ఇల్లాలిని చూడు..అని మన పెద్దలు చెప్పిన సామెత చందంగా మన ఇళ్లు ముఖ ద్వారంతోనే మన విలువలు, మన శుభ్రత ఇతరులకు తెలుస్తుంది. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల రిత్యా దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఇల్లాలకి సహకరిస్తూ ఇంటి శుభ్రంలో యజమాని పాలుపంచుకోవాలి.
ఇక ఇంటి లోపలికి ప్రవేశించన తర్వాత హిందూ సాంప్రదాయాన్ని పాటించే వారు గోమాత విగ్రహం పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు.ఎప్పుడూ పాలదారను అందజేసే గోమాతను చూడగానే అష్ట ఐశ్వర్యాలను పొందుతారని చెబుతున్నారు. కాబట్టి గోమాత ఫొటోను ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత చూసేలా పెట్టుకోవాలి.

ఎలాంటి బరువులు పెట్టరాదు?
ఇంటిలోకి వెళ్లిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం, తూర్పు యొక్క గోడలపై ఎలాంటి బరువులు ఉంచరాదు. ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఉత్తరం, తూర్పు గోడలు ఇంటికి ఊపిరితిత్తులు లాంటివి అంట. వాటిపై బరువు ఉంటే ఇంటిలో మంచిగా ఉండదని చెబుతున్నారు. అలా అని 10 గ్రాములు, 20 గ్రాములు లాంటివి కూడా ఉంచవద్దని చెప్పడం లేదు. వీలైనంత వరకు 10, 20 కేజీలకు పైగా బరువులు ఆ గోడలపై పెట్టవద్దని అది వాస్తుకు అనుకూలం కాదని చెబుతున్నారు. ఈశాన్యంలో ఎప్పుడూ ద్వారం ఉండేలా చూసుకోవాలని కూడా చెబుతున్నారు.
ఆరోగ్యంగా ఉండండి?
మన ఇంటిలోకి ధనాకర్షణ రావాలంటే ముందుగా ఇంటి లోపలికి గాలి, వెలుతురు సులువుగా ప్రసరించే విధంగా చూసుకోవాలి. ఉదయాన్నే సూర్య కిరణాలు మన ఇంటి లోపలికి వచ్చేలా చూసుకోవాలి. సూర్యభగవానుడు దేవుడు. ఇంత వెలుగును అందిస్తున్న సూర్యుడు కాంతికి మనం ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదు. కాబట్టి ప్రతి ఇంటిలోపలకి ఉదయాన్నే గాలి, వెలుతురు, సూర్య కిరణాలు పడేలా చూసుకోవాలి. సూర్య కిరణాల వల్ల డి విటమిన్ మనకు లభిస్తుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే విధంగా ఇంటిలో సూర్య కిరణాలు పడితే ఏమైనా క్రిములు, కీటకాలు చనిపోతాయి. సూర్యకిరణాలు వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇస్తుంది.

ప్రకృతిని ప్రేమించండి!
ఇంటిలో తూర్పు, ఉత్తరానికి డోర్లు, టాయిలెట్లు ఆనుకోని ఉండరాదని సూచిస్తున్నారు. ఎప్పుడూ కూడా ఇంటి యజమాని దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా పిల్లలు లేని వారు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో అని జీవరాసులు ఎలా పుడుతున్నాయో భగవంతుడు కూడా అలానే మనకు పిల్లల్ని కలగజేస్తాడు. పిల్లలు లేని వారు బాధపడకుండా ప్రకృతిని పూజించమంటున్నారు. ఎలా అంటే? మొక్కలు నాటటం ద్వారా. మొక్కలు నాటడం తో పాటు వాటిని కళ్లు మూసుకొని ఆ మొక్కను పట్టుకుని ప్రకృతిని ఆస్వాదించాలంట. అలా మురిసిపోవాలంట. నాకు పిల్లలు పుడతారు అనుకోవాలంట. ఈ విధంగా ప్రపంచంలో ప్రకృతి దైవ సృష్టి కాబట్టి ప్రకృతితో మమేకం అవ్వమంటున్నారు పండితులు.
మంచి ఆహారం తినండి!
ఇక డబ్బు సంపాదించేవారు ముందు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. పాత కాలంలో అయితే అప్పుడు వండుకున్న ఆహారం అప్పుడే తినేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంటిలోకి ప్రవేశించి వండిన ఆహారం ఫ్రిజ్లో పెట్టి మూడు, నాలుగు రోజుల వరకూ తినడం వల్ల కాన్సర్ తో పాటు ఇతర రోగాలు వస్తున్నాయట. కాబట్టి అనారోగ్యంగా ఉండి నెలకు 10 రోజులు పని చేసి 20 రోజులు పడుకోవడం కన్నా. ఆరోగ్యంగా ఉండి నెలకు 30 రోజులు లేదా 29 రోజులు పనిచేసేవారి వద్దనే సంపాదన ఉంటుందట. ఇక మహిళలు (గృహిణులు) ఎప్పటి లాగానే పోప్ డబ్బాల్లో డబ్బులు దాచుకోవాలని, వాటిని ఇంకా ఆదాయం పెరిగేలా చూడాలని సూచిస్తున్నారు. పోపు డబ్బాల్లో డబ్బులు దాయడం ఇప్పటి ఆచారం కాదు. మన ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం కాబట్టి ఇంటి గృహిణులు తప్పకుండా పాటించే సూత్రాల్లో ఇది ఒకటి. కాబట్టి పోపు డబ్బాల్లో డబ్బులు దాస్తూనే ఉండమంటున్నారు. ఇక చివరిగా అందరూ నూతన సంవత్సరంలో బాగుండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర 20222 శుభాకాంక్షలు.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?