new year celebrations banned in vijayawada | నగరంలో న్యూయర్ వేడుకలు నిషేధం : సీపీvijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ రెండో దశతో పాటు కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వ్యాప్తి కారణం దృష్ట్యా విజయవాడలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని బందరు రోడ్డులో జనాలు గుమ్మిగూడటం, రోడ్లపైకి వచ్చి కేక్ కోయడం లాంటివి నిషేధించినట్టు తెలిపారు. 31న రాత్రి 10 గంటలకల్లా నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఇతర సంస్థల్లోనూ ఎలాంటి వేడుకలను నిర్వహించకూడదని హెచ్చరించారు.
తొలి కరోనా వైరస్ స్ట్రైయిన్ కేసు నమోదు
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తొలి దశ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ, మరో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ తొలి కేసు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన ఓ మహిళకు కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు. రాజమండ్రి రూరల్ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణ నగర్ కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళ ఒకరు డిసెంబర్ 22న యూకే నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెను తీసుకొచ్చేందుకు కుమారుడు ఢిల్లీ వెళ్లారు. యూకేలో కరోనా టెస్టులు చేయించుకున్నప్పటికీ ఫలితాలు రాకముందే ఆమె భారత్‌కు వచ్చినట్టు సమాచారం. ఇండియాలో కూడా ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేశారు. రిపోర్టు వచ్చే వరకు క్వారంటైన్ లో ఉండాలని ఆమెకు అధికారులు సూచించారు. కానీ అక్కడ ఉండకుండా సొంతూరు రాజమండ్రికి బయలుదేరారు. ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కినట్టు పోలీసులు ధృవీకరించారు.


టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది
ఇంగ్లాండ్ నుంచి డిసెంబర్ 23వ తేదీ అర్థరాత్రి ఆంగ్లో ఇండియన్ మహిళ, ఆమె కుమారుడు రాజమండ్రి వచ్చారు. మహిళకు యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకినట్లు ఇక్కడ వైద్య శాఖ నిర్థారించింది. కానీ ఆమె కుమారుడికి మాత్రం నెగిటివ్ వచ్చిందని తెలిసింది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. బ్రిటన్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన 114 మందిలో111 మందికి కరోనా టెస్టులు చేయగా వారిలో నలుగురికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
కాకినాడ వెంకట్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, ఫ్రైమరీ కాంటాక్ట్ లో మరో ముగ్గురికి పాజిటివ్ గా తేలింది. పరీక్షల నిమిత్తం వారి నమూనాలను హైదరాబాద్ సిసిఎమ్బికి పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉందని, నలుగురు పాజిటివ్ వ్యక్తుల ఫ్రైమరీ కాంటాక్ట్ గా సుమారు వెయ్యి మందికి టెస్టులు నిర్వహిస్తున్నామని స్థానిక వైద్య శాఖ తెలిపింది.
ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో 326 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 88,1,599 కి చేరింది. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఆధారంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు మృతి చెందారు.
దీంతో మృతుల సంఖ్య 7100 మందికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 364 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 87,1,116 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 3,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయి లో కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి వరకు 1,17,08,678 శాంపిల్స్‌ను పరీక్షించారు.
ఇది చదవండి: ఉద్యోగుకులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు