new year 2022 telugu astrology: కొత్త సంవ‌త్స‌రం మీ రాశి ఫ‌లాల గురించి తెలుసుకోండి?

new year 2022 telugu astrology: 2022 సంవ‌త్స‌రం astrosage వేద జ్యోతిష‌శాస్త్రం యొక్క ప‌లు భిన్నమైన సూత్రాల‌పై ఆధార‌ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. అదే విధఃగా అన్ని రాశి చ‌క్రాల కోసం 2022 వార్షిక ఫ‌లాల‌ను ఇక్కడ అందిస్తున్నాము. రాబోయే కాలంలో మీకు ఇవి స‌హాయ‌ప‌డ‌టానికి సిద్ధంగా ఉంచుతున్నాము. ఈ రాశి ఫ‌లాలు మీ విజ‌యానికి, వ‌చ్చే అవ‌కాశాల‌కు , ఎదుర్కొనే స‌వాళ్ల‌ను ఎలా నిర్వ‌హించాలో అర్థ‌మ‌య్యేలా చేస్తుంది. న‌క్ష‌త్రాల ప్ర‌భావం, గ్ర‌హ సంచారాలు, వాటి క‌ద‌లిక‌లు సంయోగాలు మ‌న జీవితాల‌పై వాటి ప్ర‌భావం ఎలా ఉంటుందో అవ‌గాహ‌న కోసం(new year 2022 telugu astrology) అందిస్తున్నాం.

మేష‌రాశి(2022)

మేషరాశి ఫ‌లం ఆధారంగా అంగార‌క గ్ర‌హం ధ‌నస్సు రాశిలోకి ప్ర‌వేశించి నెల చివ‌రి అర్థ‌భాగంలో అన‌గా జ‌న‌వ‌రి 16, ఆర్థిక కోణం నుండి అనుకూల‌మైన‌దిగా మారుతుంది. ఈ రాశి మేష‌రాశి వారి జీవితాల‌లో సానుకూల ఫ‌లితాల త‌రంగాన్ని తీసుకువ‌స్తుంది. ఏప్రిల్ 13న మీన రాశిలో బృహ‌స్ప‌తి సంచారం మీ విద్యా ప్ర‌య‌త్నాల్లో విజ‌యం సాధించ‌డంలోనూ స‌హాయ‌ప‌డుతుంది. ఈ ఏడాది పొడ‌వునా శ‌ని మీ 10వ ఇంట్లో ఉన్నందున‌, విజ‌యం సాధించ‌డానికి మీరు మునుప‌టి కంటే ఎక్క‌వు క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

 • 2022 సంవ‌త్స‌రం ప్రారంభం ప్రేమికుల జీవితాల‌కు స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
 • ఏడాది మొద‌టి నుంచి మార్చి వ‌ర‌కు శ‌ని మ‌రియు బుధుల క‌ల‌యిక స్వ‌ల్ప ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.
 • మే మ‌ధ్య నుండి ఆగ‌ష్టు వ‌ర‌కు మీన రాశిలో అంగార‌కుడి సంచారం ఫ‌లితంగా జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయి.
 • ఆగ‌ష్టు నెల‌లో కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మిథున రాశి (2022)

 • ఈ రాశి వారు జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర కు 8వ ఇంట్లో శ‌ని త‌న సొంత రాశిలో ఉండ‌టం వ‌ల్ల ఆర్థిక న‌ష్టం, స‌వాళ్లు, బాధ‌లు వ‌స్తాయి.
 • మిథున రాశికి చెందిన వారికి ఇది ప‌రీక్షా స‌మ‌యం.
 • ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య నుండి (17 ఫిబ్ర‌వ‌రి) ఏప్రిల్ వ‌ర‌కు ఎసిటిడి, కీళ్ల నొప్పులు, జ‌లుబు – ద‌గ్గులాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.
 • విద్యార్థులు ఏప్రిల్ మ‌రియు జూలై మ‌ధ్య వారి విద్యా జీవితంలో ఆశించిన ఫ‌లాలు పొందుతారు.
 • పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విద్యార్థులు విజ‌యం సాధించడానికి ఎక్కువ స‌మ‌యం వేచి చూడాలి.
 • ఉద్యోగులు మే మ‌రియు ఆగ‌ష్టు మ‌ధ్య మంచి ఫ‌లితాన్ని, అవ‌కాశాల‌ను అందుకుంటారు.

క‌ర్కాట‌క రాశి(2022)

 • ఈ రాశి వారికి 2022లో ప్రారంభంలో అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.
 • జ‌న‌వ‌రి 17న ధ‌న‌స్సు రాశిలో మార్స్ సంచారంతో మీలో ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది. అనేక స‌మ‌స్య‌లు త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి.
 • విశ్రాంతి మ‌రియు సంతోషం యొక్క ఇంట్లో ఉన్న అంగార‌క గ్ర‌హం మీ త‌ల్లికి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తుంది. అందువల్ల ఆమెను(ఏమి తింటుందో, ఏమి తాగుతుందో) బాగా చూసుకోండి.
 • కుంభ రాశిలో శ‌ని సంచారం వ‌ల్ల మీ ఆర్థిక జీవితాన్ని ఎక్కువ ప్ర‌భావితం చేస్తుంది.
 • ఏప్రిల్ నుండి ఆగ‌ష్టు వ‌ర‌కు స‌మ‌యం ఫ‌లవంత‌మైన‌దిగా చెప్ప‌వ‌చ్చు.

సింహ‌రాశి(2022)

 • ఈ రాశి వారికి 2022లో జ‌న‌వ‌రి నెల‌లో బృహ‌స్ప‌తి 5వ ఇంట్లో సంచ‌రించ‌డం వ‌ల్ల ఆర్థిక జీవితం బాగుంటుంది.
 • జ‌న‌వ‌రి చివ‌రి నుండి మార్చి వ‌ర‌కు పిల్ల‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.
 • ఫిబ్ర‌వ‌రి 26న 6వ ఇంట్లో ఉన్న అంగార‌కుడు అదృష్టం మ‌రియు అందుకు సంబంధించిన ఇంటిని ఆశిస్తూ వృత్తి జీవితంలో గొప్ప విజ‌యాన్ని సాధిస్తారు.
 • ఫిబ్ర‌వ‌రి మ‌రియు ఏప్రిల్ నెల‌ల్లో స్థానికులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
 • సింహ‌రాశి వారికి ఏప్రిల్ నెల ఊహించ‌ని సంఘ‌ట‌నల‌తో నిండి ఉంటుంది.
 • ఉద్యోగుల‌కు ఏప్రిల్ 22 త‌ర్వాత వృత్తిప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు సీనియ‌ర్లు మ‌రియు బాస్‌తో మంచి వృత్తిప‌ర‌మైన సంబంధాలు బ‌ల‌ప‌డ‌తాయి.
 • ఏప్రిల్ మ‌రియు సెప్టెంబ‌ర్ మ‌ధ్య వివాహిత జంట‌లు త‌మ వైవాహిక సమ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తారు.

క‌న్య‌రాశి (2022)

 • ఈ రాశి వారు 2022 ప్రారంభంలో గొప్ప సంప‌ద మ‌రియు ఆర్థిక శ్రేయ‌స్సును పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
 • ఏప్రిల్‌, జూన్ మ‌రియు సెప్టెంబ‌ర్ నెల‌లు అనుకూల‌మైన‌వి.
 • ఫిబ్ర‌వ‌రి 26 నుంచి ఈ రాశి వారికి ఆశావాద విద్యా ఫ‌లితాల‌కు దారి తీస్తుంది.
 • మార్చి ప్రారంభంలో కొత్త ఆదాయ వ‌న‌రుల‌కు దారి తీస్తుంది.
 • జూన్ చివ‌రిలో కుటుంబాల మ‌ధ్య విబేధాల‌ను అనుభ‌వించ‌వ‌చ్చు.
 • సెప్టెంబ‌ర్ మ‌రియు డిసెంబ‌ర్ ముగింపు మ‌ధ్య స‌మ‌యం విదేశాల‌కు వెళ‌తారు. విదేశీ విద్య‌కు అత్యంత అనుకూల‌మైన‌ది.
 • అక్టోబ‌ర్ నెల‌లో ప్రియ‌మైన వారి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతుంది.

తుల‌రాశి(2022)

 • ఈ రాశి వారికి 2022 సంవ‌త్స‌ర ప్రారంభంలో శారీర‌కంగా, మాన‌సికంగా, వృత్తిప‌రంగా అనుకూల‌మైన ఫ‌లితాల‌ను పొందుతారు.
 • వ్యాపారం మ‌రియు కుటుంబం గురించి మాట్లాడిన‌ప్పుడు విష‌యాలు యూట‌ర్న్ తీసుకోవ‌చ్చు.
 • జ‌న‌వ‌రి 9 త‌ర్వాత ఆర్థిక లాభాలు వ‌రిస్తాయి.
 • మార్చి ప్రారంభం కూడా ఆర్థిక విజ‌యం, న‌గ‌దు ప్ర‌వాహం ల‌భిస్తుంది.
 • ఏప్రిల్ 17 త‌ర్వాత విద్యారంగంలో మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.
 • మే మ‌రియు న‌వంబ‌ర్ మ‌ధ్య విదేశీ ప్ర‌యాణం, ఉద్యోగం లేదా విద్య‌కు సంబంధిత ఏదైనా నెర‌వేరుతుంది.
 • ఏప్రిల్‌లో ప్రేమికులు, వివాహితులైన స్వ‌దేశీయుల జీవితంలో పెద్ద మార్పుల‌ను తీసుకురాగ‌ల‌వు.

వృశ్చిక‌రాశి(2022)

 • ఈ రాశి వారు 2022 సంవ‌త్స‌రం ప్రారంభంలో మిశ్ర‌మ ఫ‌లితాల‌తో నిండి ఉంటుంది.
 • సంవ‌త్స‌రం ప్రారంభం నుండి ఏప్రిల్ వ‌ర‌కు అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు ఉంటాయి.
 • ఏప్రిల్ నెలాఖ‌రులో ఆర్థిక‌, కుటుంబ జీవితంలో మిశ్ర‌మ ఫ‌లితాల‌ను అందిస్తుంది.
 • ఏప్రిల్ 22న రాహువు త‌న స్థానాన్ని మార్చుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాక‌పోతే మాన‌సికంగా ఒత్తిడికి గుర‌వుతారు.
 • ఏప్రిల్ చివ‌రి రోజుల‌లో ప్రియ‌మైన వారి మ‌ధ్య చిన్న వాద‌న‌లు, త‌గాదాల‌కు దారి తీస్తుంది. అయితే మీ సంబంధాన్ని విశ్వసించాల్సిన అవ‌స‌రం ఉంది లేకుంటే పెద్ద త‌గాదాల‌కు దారితీస్తాయి.
 • పెస్టెంబ‌ర్ మ‌రియు న‌వంబ‌ర్ మ‌ద్య మంచి స‌మ‌యాన్ని గ‌డ‌ప‌టానికి చాలా స‌మ‌యం పొందుతారు.
ధ‌నుస్స‌రాశి(2022)
 • ఈ రాశి వారు 2022 వారికి ఆర్థిక ప‌రంగా అనుకూల‌మైన‌ది.
 • జ‌న‌వ‌రి లో ఆర్థిక ప‌రిస్థితులు నిర్థిష్ట స్థాయికి బ‌లోపేతం చేయ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి.
 • విద్యావేత్త‌ల ప‌రంగా ఈ ఏడాది విద్యార్థుల‌కు అనుకులంగా ఉంటుంది.
 • ఫిబ్ర‌వ‌రి నుండి జూన్ వ‌ర‌కు మీ కృషి ఫ‌లితాన్ని పొందుతారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వారు అంచ‌నాల‌ను అధిగ‌మించే సామ‌ర్థ్యాన్ని అనుభ‌విస్తారు.
 • జూన్ నుండి జూలై వ‌ర‌కు మీ వైవాహిక జీవితం గ‌ణ‌నీయమైన మెరుగుద‌ల‌కు లోన‌వుతుంది. త‌ద్వారా వైవివాహ‌కి జీవితం ఆనందంగా ఉంటుంది.
 • జూన్ మ‌రియు అక్టోబ‌ర్ వ‌ర‌కు ఏవైనా పెద్ద జ‌బ్బులు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.
మ‌క‌ర‌రాశి(2022)
 • ఈ రాశి వారికి 2022లో ప్రారంభంలో ఎత్తు ప‌ల్లాల‌తో నిండి ఉంటుంది.
 • సంవ‌త్స‌రం ప్రారంభంలో కెరీర్ ఫైనాన్స్ మ‌రియు విద్యావేత్త‌ల‌కు అనుకూలంగా ఉంటుంది.
 • ఏప్రిల్ నెల‌లో ర‌వాణా జీవితంలో వివిధ అంశాల‌లో స‌వాళ్ల‌ను తీసుకురాగ‌ల‌దు.
 • వ్యాపార వేత్త‌లు, వ్యాపారుల‌కు సెప్టెంబ‌ర్ నుండి సంవ‌త్స‌రం చివ‌రి వ‌ర‌కు స‌మ‌యం ఫ‌ల‌వంత‌మైన‌దిగా రుజువు చేస్తుంది.
 • ఏప్రిల్ నెల‌లో చిన్న పాటి ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండి.
 • సెప్టెంబ‌ర్ మ‌రియు న‌వంబ‌ర్ మ‌ధ్య జీర్ణ‌క్రియ లేదా క‌డుపు సంబంధిత స‌మ‌స్య‌ను విస్మ‌రించ‌వ‌ద్దు.
 • ప్రేమించిన మ‌రియు వివాహం చే సుకున్న స్థానికుల‌కు స‌మ‌యం మిశ్ర‌మ ఫ‌లితాల‌ను అందిస్తుంది.
 • ప్రేమ‌లో ఉన్న వారికి ఏప్రిల్ నెల‌లో అనుకూల‌మైన ఫ‌లితాల‌ను క‌లిగిస్తుంది.
 • ఆగ‌ష్టు నుండి వైవాహిక జీవితం గొప్ప‌గా మారుతుంది.
కుంభ‌రాశి (2022)
 • ఈ రాశి వారికి 2022 ప్రారంభంలో స్వ‌దేశీయుల‌కు అనుకూలంగా ఉంటుంది. జ‌న‌వ‌రి నెలలో ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరుస్తుంది.
 • మార్చి ప్రారంభంలో మంచి సంపాద‌న‌తో విజ‌యం సాధిస్తారు.
 • ఏప్రిల్ 22 త‌ర్వాత మిమ్మ‌ల్ని హ‌ఠాత్తుగా నిర్ణ‌యాలు తీసుకునేలా చేస్తాయి. మీరు అలాంటి విష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. ఏదైనా మిమ్మ‌ల్ని ప్ర‌భావితం చేయ‌నివ్వ‌వ‌ద్దు.
 • ఈ ఏడాది పొడ‌వునా మీ ఆరోగ్యం స‌గ‌టుగానే ఉంటుంది.
 • జ‌న‌వ‌రి నెల‌లో, ఫిబ్ర‌వ‌రి నుండి మే వ‌ర‌కు మాన‌సిక ఒత్తిడికి గురవుతారు.
 • కెరీర్ మ‌రియు వృత్తిప‌ర‌మైన జీవితంలో భారీ విజ‌యాన్ని పొందుతారు.
 • సెప్టెంబ‌ర్ నెల నుండి న‌వంబ‌ర్ నెల వ‌ర‌కు చిన్న స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌చ్చు ఉద్యోగం ప‌రంగా.
 • 2022 సంవ‌త్స‌రం వివాహితులైన స్థానికుల‌కు మిశ్ర‌మంగా ఉంటుంది.
 • వివాహం కాని వారు ఏప్రిల్ నెల‌లో వివాహం చేసుకోవ‌చ్చు.
మీన‌రాశి(2022)
 • ఈ రాశి వారికి 2022 సంవ‌త్స‌రం చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా వ‌ర‌కు ఆర్థికంగా సంప‌న్నంగా ఉంటారు.
 • ఏప్రిల్ నెల‌ల నుండి కొత్త ఆదాయ వ‌న‌రులు ఏర్ప‌డ‌తాయి.
 • ఆగ‌ష్టు మ‌రియు అక్టోబ‌ర్ మ‌ధ్య జీవితంలో అనేక ఆర్థిక ఒడిదుడుకులు చూస్తారు. వృత్తిపరంగా ఆశించిన ఫ‌లితాల‌ను సాక్షిస్తారు.
 • ఏప్రిల్ నెల‌లో స‌హ‌ద్యోగుల‌తో మంచి సంబంధాలు ఏర్ప‌డ‌తాయి. ప‌దోన్న‌తి పొంద‌వ‌చ్చు. ఇంక్రిమెంట్‌ను పొంద‌వ‌చ్చు.
 • ఏప్రిల్ 21 త‌ర్వాత వివాహం చేసుకున్న జంట‌ల మ‌ధ్య కొత్త‌ద‌నం ఉంటుంది. అయితే మీ ప్రేమ జీవితంలోకి మూడ‌వ వ్య‌క్తి అక‌స్మాత్తుగా ప్ర‌వేశించ‌వ‌చ్చు.
 • సెప్టెంబ‌ర్ మ‌రియు న‌వంబ‌ర్ మ‌ధ్య చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌పై వాదించ‌డం మానుకోండి.
Share link

Leave a Comment