New Movies news | ఈ రోజు టాలీవుడ్ న్యూస్(గురువారం) కింద ఇవ్వడం జరిగింది. ఆచార్య మూవీ అప్డేట్స్, సర్కారు వారి పాట సాంగ్, ఆర్ఆర్ఆర్ దోస్తీ సాంగ్ విడుదల, రష్మిక – ఎన్టీఆర్ కొత్త మూవీ, పాన్ ఇండియా స్టార్స్, కేజీఎఫ్-2, విజయ్ దేవరకొండ- సమంత కొత్త సినిమా మొదలగునవి మూవీ అప్డేట్స్(New Movies news) చదవండి.
యష్, ప్రభాస్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా!
Pan India స్టార్స్ యష్. ప్రభాస్ హీరోలుగా ప్రశాంత్ నీల్ ఓ మల్టీస్టారర్ చేస్తే చూడాలని సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఆ కథ కూడా కేజీఎఫ్, సలార్ల మిక్సింగ్‌గా ఉండాలన్నది ఫ్యాన్సీ కోరిక. కేజీఎఫ్, సలార్ కథల కొనసాగింపుగా స్టోరీ ఉండే బాగుంటుందనేది వారి ఆలోచన, ఈ లైన్ మూవీ కథగా రూపొందితే అదుర్స్ అంటూ సోషల్ మీడియా మోతెక్కిపోతుంది.
డోస్ సరిపోలేదంటున్న Acharya ఫ్యాన్స్!
మెగస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లతో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య మూవీ ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ మాసివ్ మల్టీస్టారర్ సినిమాపై మంచి హైప్ ఉన్నా. రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో యూనిట్ అంత యాక్టివ్‌గా ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న డోస్‌ను పెంచి, సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పోతే ఆచార్య సినిమా ప్రీ – రిలీజ్ ఫంక్షన్‌కు హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీసు గ్రౌండ్స్‌లో ఈ నెల 23న నిర్వహిస్తున్నట్టు యూనిట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి గెస్టులుగా ఎవరు వస్తున్నారన్న దానిపై యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆచార్య సినిమాకు మహేష్ బాబు Voice over ఇస్తున్నాడని తెలుస్తోంది. అతని వాయిస్‌తోనే సినిమా మొదలవుతుందట. ఈ విషయాన్ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా మూవీకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఎమోషనల్ అయిన కాజల్!
బిడ్డకు జన్మనివ్వడం పట్ల తాను పొందిన అనుభూతిని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలియజేసింది. ‘Neel పుట్టిన క్షణాల్లో తెల్లటి వస్త్రాన్ని ధరింపజేసి నా ఛాతిపై పడుకోబెట్టారు. నీల్ నా గుండెపై పడుకున్నప్పుడు వర్ణించలేని అనుభూతిని పొందాను. ఒక్క క్షణం తల్లిగా పట్టలేని ఆనందం పొందాను. కానీ అంత ఈజీ కాలేదు. 3 రోజులు నిద్రలేని రాత్రులు, రక్తస్రావం, సాగిన చర్మం, ఘనీభవించిన ప్యాడ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది’ అని కాజల్ ఎమోషనల్ అయ్యారు.
సర్కారు వారి పాట అదిరిపోనుందా?
తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న Sarkaru vaari paata నుంచి మరో పాట శనివారం ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. ఈ సారి రిలీజ్ కానున్న పాట టైటిల్ సాంగ్ కావడంతో మంచి అంచనాలు ఉండగా, తమన్ ఆ పాటను హమ్ చేస్తూ తాజాగా పెట్టిన ఓ వీడియో అంచనాలను మరింత పెంచుతోంది. కాగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
మాజీ భార్యపై పరువు నష్టం వేసిన హీరో
తన మాజీ భార్య అంబర్ హెర్డ్ తాను గృహ హింస బాధితురాలిని అని రాసిన వ్యాసంపై హాలీవుడ్ హీరో johnny deep రూ.360 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆమె నన్ను మూర్ఘుడిగా ..మాటల్లో చెప్పలేని తిట్లతో అవమానించేదని ఆయన పేర్కొన్నారు. టివి రిమోట్, వైన్ గ్లాస్ తలపై విసిరేది అని, మానవ మలం బెడ్‌పై ఉంచేది అని వర్జీనియా కోర్టులో హీరో జానీ డేప్ వాపోయాడు. డేపే హింసించే వాడని అంబర్ రూ.700 కోట్ల కేసు వేసింది. ఈ కేసులో సాక్షిగా ఎలన్ మాస్క్‌ను కోర్టు విచారించనుంది.
RRR నుంచి దోస్తీ ఫుల్ సాంగ్ విడుదల
RRR చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య సాగే దోస్తీ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఎత్తర జెండా, కొమ్మ ఉయ్యాల పూర్తి వీడియో సాంగ్స్‌ను విడుదల చేవారు. అభిమానుల నుంచి ఈ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ పాటలో రామరాజు, భీమ్ల మధ్య స్నేహం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిన కొమురం భీముడో వీడియో సాంగ్‌ను చివర్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు.
ఆలియా భట్ ఔట్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కే మూవీ నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో రష్మికను తీసుకుంటున్నట్టు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, తర్వలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్టీఆర్ తన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారట. జనతాగ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల శివ కలిసి చేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
Pan India Stars..పాన్ మసాలా స్టార్స్
పుష్ప, RRR,KGF-2 సినిమాలతో సౌత్ ఇండియా సత్తా బాలీవుడ్‌కు తెలిసింది. ఈ సినిమాలకు నార్త్ో విపరీతమైన క్రేజ్ రావడంతో అక్కడి వాళ్లు హిందీ హీరోల కంటే సౌత్ హీరోలే సూపర్ అంటూ పొగుడుతున్నారట. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ మీమ్ తెగ Viral అవుతోంది. బన్నీ, ఎన్టీఆర్, చరణ్, యశ్ని పాన్ ఇండియా స్టార్స్‌గా అక్షయ్, అజయ్ దేవగన్, షారుఖ్‌ను Pan masala స్టార్స్‌గా చూపిస్తూ ట్రోల్ చేశారు.
విజయ్, సమంత కొత్త సినిమా ప్రారంభం
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభమైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమం Hyderabad లో జరిగింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ విజయ్‌పై క్లాప్ కొట్టారు. ఇక Rowdy Boy కి జంటగా సమంత నటిస్తున్నారు. ఈ సినిమాకు Kushi అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ లైగర్, సమంత కాతు వాకుల రెండు కాదల్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!