Jaggayyapeta Covid Cases : Jaggayyapeta : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట(Jaggayyapeta) పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేటలో కరోనా కేసులు పెరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జగ్గయ్యపేట ఎస్సై సిహెచ్. చిన్న బాబు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పట్టణంలోని స్థానికులకు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మంగళవారం వర్తక సంఘం షాపులు వారి దగ్గరకు వెళ్లారు. కరోనా మరలా విజృభించుతున్నందున ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని కోరారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహన దారులు వాహనం నడిపే సమయంలో తప్పని సరిగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. వర్తక వాణిజ్య సంఘాల వారు తమ తమ షాపుల వద్ద శానిటైజర్ ఉంచాలని తెలిపారు. షాపులకు వచ్చే కస్టమర్ల విషయంలో సామాజిక దూరం పాటించేలా సర్కిల్ వలె గీతలు గీయాలని,షాపుకు వచ్చిన వారు సర్కిల్ యందునే నిల్చొని వస్తువులు తీసుకోవాలని సూచించారు. తోపుడు బండ్లు వారికి కూడా కరోనా వైరస్ గురించి తగు జాగ్రత్తలు తెలియజేశారు. బండికి బండికి మధ్య దూరం ఉండేలా చూడాలని ఆదేశించారు.

- Online class : చెట్టు కింద చదువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచనకు జేజేలు!
- Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
- Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
- khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
- Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!