Covid Cases

Covid Cases : Andhra Pradesh |కోస్తాంధ్ర‌లో క‌రోనా క‌ల‌క‌లం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

స్పందించిన వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని

Covid Cases : Vijayawada : కోస్తాంధ్ర ప్రాంత‌మైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో క‌రోనా విజృంభ‌న మ‌ళ్లీ క‌ల‌క‌లం రేపుతోంది. క‌రోనా కేసులు పెర‌గ‌డంతో రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావ‌రి జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. మూడు జిల్లాల డిఎంహెచ్ లు డాక్ట‌ర్ యాస్మిన్‌, డాక్ట‌ర్ సుహాసిని, డాక్ట‌ర్ గౌరి స్వ‌ర‌రావుల‌తో ఫోన్‌లో మాట్లాడి క‌రోనా కేసుల‌పై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు.
గుంటూరు జిల్లా పొన్నూరు, తెనాలిలో క‌రోనా పాజిటివ్ కేసులు అధికం కావ‌డంతో డిఎంహెచ్ఓ ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి సూచించారు. క‌రోనా బాధితుల‌కు అన్ని విధాలుగా వైద్య స‌దుపాయం క‌ల్పించాల‌ని వైద్య సిబ్బంది నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ఆదేశించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న క‌రోనా బాధితుల‌కు మెడిక‌ల్ కిట్స్ అంద‌జేయాల‌ని డిఎంహెచ్ఓ డాక్ట‌ర్ యాస్మిన్‌కు మంత్రి సూచించారు. తెనాలిలో మునిసిప‌ల్ సిబ్బందికి క‌రోనా నిర్థార‌ణ కావ‌డంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉంచామ‌న్నారు. ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంటాక్ట్ ఉన్న వారికి తెనాలి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయిస్తున్నామ‌న్నారు. పొన్నూరులోని ప్రైవేటు స్కూల్లో విద్యార్థుల‌కు ర్యాండంమ్ గా క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని వైద్య అధికారుల‌కు మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ఎవ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్దు: మంత్రి

Covid Cases : స్టూడెంట్స్‌, పేరెంట్స్ మ‌రెవ‌రూ భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని, ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌ని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని క‌రోనా కేసులు పెరుగుతున్న దృష్ణ్యా మెడిక‌ల్ టీమ్స్ పూర్తిగా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఇంటింటికి వెళ్లి స‌ర్వే టీమ్స్ వివ‌రాలు సేక‌రించాల‌ని సూచించారు. జ‌గ్గ‌య్య‌పేట ప్రాంతంలో క‌రోనా బాధితుల‌ను హోం క్వారంటైన్‌కు త‌ర‌లించామ‌న్నారు. క‌రోనా సోకిన బాధితులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నార‌ న్నారు. వారికి అవ‌స‌ర‌మైన వైద్యం అందిస్తున్నామ‌న్నారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో 40 మంది క‌రోనా బాధితుల‌కు ప్ర‌త్యేకంగా వైద్య స‌దుపాయం క‌ల్పించామ‌న్నారు.
కృష్ణా జిల్లాలో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న క్ర‌మంలో అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌సీమ ప్రాంతం మ‌ల్కిపురం జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ లో 12 మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయ్యింద‌న్నారు. ఆ విద్యార్థుల‌ను హోం క్వారంటైన్‌కు త‌ర‌లించామ‌న్నారు. జిల్లా ప‌రిష‌త్ హై స్కూల్ లో పూర్తిగా శానిటేష‌న్ చేయించి అన్ని జాగ్ర‌త్త‌లు చేప‌ట్టామ‌న్నారు. ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంటాక్ట్ పై కూడా మెడిక‌ల్ టీమ్స్ స‌ర్వే చేస్తున్నామ‌న్నారు. కొంత మంది ఉపాధ్యాయుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ చేయ‌గా వారికి ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని తెలిపారు.

నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ దృశ్యం (photo : ANI)

దేశ వ్యాప్తంగా పంజా విసురుతోన్న క‌రోనా!

Covid Cases : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో సారి పంజా విసురుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతుండ‌టంతో మ‌ళ్లీ ఆందోళ‌న రేకెత్తుతోంది. దేశ వ్యాప్తంగా 24 గంట‌ల్లో 26,291 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ 2021లో న‌మోదైన అత్య‌ధిక కేసులు ఇవే. తాజా కేసుల‌తో దేశం మొత్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1,13,85,339 కి చేరింది. ఇదే స‌మ‌యంలో 17,455 మంది వైర‌స్ బారిన ప‌డి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,10,07,352 మంది క‌రోనాను జ‌యించారు. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ రేటు 96.68 శాతంగా ఉంది. మ‌హారాష్ట్ర‌లో రోజురోజుకీ కొత్త క‌రోనా కేసులు న‌మోదువుతున్నాయి. ఆదివారం కేసుల సంఖ్య ఏకంగా 16 వేల‌కు దాటింది. 16,620 మంది వైర‌స్ బారిన ప‌డ‌గా, 50 మంది మృతి చెందారు. దేశ‌వ్యాప్తంగా మొత్తం 2.19 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క మ‌హారాష్ట్ర‌లోనే 1,26,231 క్రియాశీల కేసులు న‌మోదుయ్యాయి. మ‌హారాష్ట్ర‌లో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంది. నాగ్‌పూర్ తో పాటు కొన్ని జిల్లాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించింది.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *