new cabinet minister list | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండ్రోజుల కిందట 25 కొత్త జిల్లాల ఏర్పాటు జరగడంతో పాటు అమలులోకి కూడా వచ్చాయి. ఇప్పుడు కొత్త మంత్రి మండలి ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. ఏపీలో కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ కూడా అయిపోయింది. ఈ నెల 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు దివ్యమైన ముహూర్తాన కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారి చేత ప్రమాణం చేయిస్తారు.
new cabinet minister list
ఇక కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే వేదికను కూడా ఎంపిక చేశారు. వెలగపూడిలోని సచివాలయ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొత్త మంత్రులు ఎవరు అన్నది ఇప్పటికైతే తెలియదు కానీ, ఈ నెల 7వ తేదీ తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ రోజున మధ్యాహ్నం మూడు గంటలకు ప్రస్తుత మండలి చివరిసారిగా భేటీ అవుతుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం తర్వాత టోటల్గా మంత్రి మండలి రాజీనామాలు చేస్తుంది. ఆ తరువాత కొత్త మంత్రులు ఎవరో కూడా తెలుస్తుంది అంటున్నారు. ఇప్పటికే కొందరికి ఈ విషయం మీద సిగ్నల్స్ అయితే వెళ్లాయని చెబుతున్నారు.అవకాశం ఉన్న వారు అందుబాటులో ఉండాలని సూచనలు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. తొలి విడత మంత్రి వర్గం మాదిరిగానే మలి విడతలో కూడా అనేక ట్విస్టులు ఉంటాయని అనూహ్యమైన పేర్లు కూడా తెర మీదకు వస్తాయని చెబుతున్నారు.
మొత్తానికి చూస్తే సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న పేర్లు కాకుండా కొత్త పేర్లను చూడవచ్చు అంటున్నారు.అలాగే ఎవరూ అనుకోని వారు కూడా మంత్రులుగా ప్రమాణం చేయవచ్చు అని అంటున్నారు. మొత్తానికి కొత్త మంత్రి వర్గం మీద జగన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని తెలుస్తోంది. మొత్తానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. టెన్షన్ కూడా అందరిలో పెరుగుతుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!