New Bride మదనపల్లి టౌన్ : పెళ్లి పీటల మీద నుంచి ఓ యువతి లేచిపోయింది. మదనపల్లి 2 టౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం, తట్టివారిపల్లికి చెందిన రామకృష్ణ మల్లికల కుమార్తె సోనికకు పెద్దలు శనివారం రాత్రి రిసిప్షన్ , ఆదివారం వివాహం జరిగేలా పెద్దలు నిశ్చయించారు. నవీన్ కుమార్ తో సోనికకు స్థానిక సంఘం ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఉద్యోగస్తులు కావడంతో లక్షల రూపాయలను వెచ్చించి పెళ్లి ఏర్పాట్లు దూమ్ దామ్‌గా (New Bride)నిర్వహించారు.
ఈ తరుణంలో తనకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం చేస్తున్నారని నెపంతో పెళ్లి కుమార్తె సోనిక కళ్యాణ మండపం నుండి ఆదివారం తెల్లవారుజామున పారిపోయింది. పెళ్లి కుమార్తె ఇలా పీటల మీద నుంచి లేచిపోవడంతో ఖంగుతిన్న పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు అవమానంతో చేసేదేమీ లేక పెద్ద మనుషులతో కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే ప్రియునితో లేచిపోయిన సోనిక తను ప్రేమించిన చరణ్‌తో వివాహం చేసకుని జంటగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?