New Bride: పెళ్లి కుమార్తె ప‌రారీ | రెండు ల‌క్ష‌లు కాజేసింద‌ని పెళ్లి కుమారుడు పోలీసుల‌కు ఫిర్యాదు!

Spread the love

New Bride: అనంత‌పురం : ఈ నెల 25న అన‌గా ఈ రోజు బుధ‌వారం పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా ఓ పెళ్లి కుమార్తె చెప్పా పెట్ట‌కుండా ప‌రారీ అయ్యింది. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటు చేసుకుంది. కళ్యాణ మండ‌పం నుండి పీఠ‌ల మీద పెళ్లి కుమార్తె ప‌రారు కావ‌డంతో పెళ్లి ఆగిపోయింది. త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అనంత‌పురం జిల్లా ఎస్‌.పి.కుంట‌కు చెందిన శివ‌య్య‌, కాంత‌మ్మ‌ల కుమారుడు రామాంజులు క‌ర్ణాట‌క రాష్ట్రం హోస్పేట‌లో ఓ ఫ్యాక్ట‌రీలో కార్మికుడుగా ప‌నిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలో తంబ‌ళ్ల‌ప‌ల్లె మండ‌లం బ‌రుజుప‌ల్లెకు చెందిన ప్ర‌హ్లాద‌, ల‌క్ష్మీదేవిల కుమార్తె కుమారితో నిశ్చితార్థం జ‌రిగింది.

వీరిద్ద‌రికి ఈ నెల 25న వివాహం జ‌ర‌గాల్సి ఉంది. మ‌ద‌న‌ప‌ల్లెలోని ఓ క‌ళ్యాణ మండ‌పంలో సాధాసీదాగా వివాహం ఏర్పాట్లు చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి పెళ్లి కుమార్తె క‌ళ్యాణ మండ‌పానికి చేరుకుంది. ఉన్న‌ట్టుండి పెళ్లి కుమార్తె(New Bride) క‌న‌ప‌డ‌కుండా పారిపోయింది. దీంతో పీట‌ల మీద‌నే పెళ్లి ఆగిపోయింది.

పెళ్లి కుమారుడు రామాంజులు, త‌ల్లిదండ్రులు మ‌ద‌న‌ప‌ల్లె వ‌న్‌టౌన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పెళ్లికుమార్తె మ‌రో యువ‌కుడితో వెళ్లిపోయింద‌ని, త‌మ‌కు రూ.2 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టించి మోసం చేసింద‌ని పెళ్లి కుమారుడు వాపోయాడు. ఈ విష‌య‌మై వ‌న్‌టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.

Guntur news: గుంటూరులో ఘ‌రానా మోసం పెళ్లి పేరుతో కోటి స్వాహా!

Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల‌వేసిన స‌త్తెన‌ప‌ల్లి కి చెందిన దంప‌తులు అత‌ని వ‌ద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి Read more

Harassment: భ‌ర్త‌కు దూరంగా ఉంటున్న భార్య‌పై క‌న్నేసిన పోకిరీలు..చివ‌రికి?

విషాదంగా ముగిసిన వివాహిత క‌థ‌! Harassment: Hyderabad: భ‌ర్త వేధింప‌లు భ‌రించ‌లేక విడిపోయి దూరంగా ఉంటుందోది ఓ వివాహిత‌. అయిన‌ప్ప‌టికీ ఆ మ‌హిళ‌కు ప్ర‌శాంత‌త దొర‌క‌లేదు. ఒంటరిగా Read more

teacher murderd: క‌దిరిలో బ‌రితెగించిన దొంగ‌లు..ఉపాధ్యాయురాలు హ‌త్య‌

teacher murderd: అనంత‌పురం: క‌దిరిలో దొంగ‌ల బీభ‌త్సం అక్క‌డ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించి ఓ ఉపాధ్యాయురాల‌ని చంపారు దుండ‌గులు. క‌దిరి ప‌ట్ట‌ణంలోని మంగ‌ళ‌వారం Read more

municipal co-option member: వైసీపీ మున్సిప‌ల్ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

municipal co-option member అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి మున్సిప‌ల్ వైసీపీ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ఆదం అహ్మ‌ద్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తాను చ‌నిపోతున్నాన‌ని చివ‌రిసారిగా ఓ వీడియోను Read more

Leave a Comment

Your email address will not be published.