Neocov Virus: దాదాపుగా మూడు సంవత్సరాల నుండి ప్రపంచాన్ని వణికిస్తూ ఎందరో ప్రాణాలను బలికొన్న కరోనా మహమ్మారి ఇప్పటికీ తగ్గలేదు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యతో ఒక ప్రక్క ప్రజలు, దేశాలు బెంబేలెత్తున్నారు. మరణాల రేటు గతేడాది కంటే తక్కువుగా నమోదు అవుతున్నప్పటికీ ప్రక్కలో బళ్లెంలా కరోనా మాత్రం మానవాళిని వదిలేలా లేదు. ఈ క్రమంతో గుండెల్లో భయం పుట్టించే మరో వార్తను శాస్త్రవేత్తలు వెళ్లడించారు. మరో కొత్త వైరస్ వెలుగు రావడంతోనే ఇది సోకిన వారిలో ముగ్గురిలో ఒకరు చనిపోవడం ఖాయం(Neocov Virus) అంటున్నారు.
దక్షిణాఫ్రికాలోని నియో కోవ్ అనే కొత్త వైరస్ ఆనవాళ్లు బయటపడినట్టు చైనాకు చెందిన వ్యూహాన్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి తెలియజేశారు. ఈ వైరస్ ఇంతకుముందు ఉన్నవాటికంటే వేగంగా వ్యాప్తిం చెందే లక్షణం ఉండటంతో పాటు మరణాల రేటు కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కరోనా భారిన పడి కుయ్యోమొర్రో అంటున్న సమయంలో మరో కొత్త వైరస్ వచ్చిందనే వార్త ప్రాణాల ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేకుండా చేసేలా ఉంది.
ఈ కొత్త రకం నియో కోవ్ వైరస్‌ను దక్షిణాఫ్రికాలోని ఓ ప్రాంతంలో గబ్బిలాల్లో గుర్తించారంట. ఈ వైరస్ కూడా కరోనా వైరస్సే నని శాస్త్రవేత్తలు తేల్చేశారు. చైనాలోని వ్యూహాన్ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌పై పరిశోధనలు జరపగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు రష్యా అధికారిక మీడియా సంస్థ స్పుత్నిక్ తన స్టోరీలో వెల్లడింది. అయితే ఇది జంతువుల నుండి కేవలం జంతువులకే సోకుతుందని చెబుతున్నప్పటికీ ఇది ఎన్ని రూపాంతరాలు చెందుతుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మనుషులకూ ప్రమాదమేనా?
ఈ కొత్త నియో కోవ్ వైరస్ జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతుంది. కానీ ఓ మ్యూటేషన్ కారణంగా ఇది మనుషులకూ సోకే అవకాశం ఉందని వ్యూహాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నియో కోవ్ యాంజియోటెన్సిన్ – కన్వర్టింగ్ ఎంజైమ్ ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీనికి ACE2ను మార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అందే విధంగా ఈ వైరస్ ఒక వేళ మనుషులకు చేరితే మాత్రం యాంటీబాడీలు పనిచేయవట. కోవిడ్ వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చని ఒక అంచనాగా చెబుతున్నారు. వైరస్ వల్ల మరణాలు రేటు కూడా ఎక్కువుగానే ఉంటుందట. ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంటున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ