Nemaleeya raja: మాస్టర్ మహన్ తేజ సమర్పించు ఎంవి మ్యూజిక్ & మూవీస్ ఛానెల్ నుండి విడుదలైన సాంగ్ నెమలీయ రాజా. తెలంగాణ జానపద సాంగ్ వెర్షన్లో 2022లో విడుదలైన ఈ పాట ఇప్పటికీ ప్రజల ఆదరణ పొందుతూనే ఉంది. భూమిని నమ్ముకుని చెమటోడ్చి కష్టపడుతున్న రైతన్న కుటుంబం నచ్చిన పాట ఇది.
నెమలీయ రాజా అనే పాటకు లిరిక్స్, మ్యూజిక్, డైరెక్షన్ మొత్తం ఎస్.వి మల్లికతేజ అందించారు. ఇక పాటను సింగర్ మామిడి మౌనిక పాడటంతో పాటు నటించారు, క్యాస్టూమ్ డిజైనర్‌గా కూడా చేశారు.ఈ పాట అంతా దుంపాలపల్లి (Dumpalapalli) గ్రామంలో షూట్ చేశారు. ఎంవి మ్యూజిక్ ఆధ్వర్యంలో వచ్చిన పాటల్లో ఇది హైలెట్‌గా నిలిచింది.
ఈ పాటలో రైతన్నలు కుటుంబ సభ్యులుగా భావించే తమ ఎద్దుల గురించి వాటి కష్టం గురించి తెలిపారు. పాటలో ప్రతి లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. ప్రతి లైన్ పాట విన్న వారి మనసులను కదిలించాయి. వేముల వాడ రాజన్న ఎక్కి తిరిగిన ఎడ్లునే నెమలియా రాజ అన్న పదం పల్లెల్లో ఎద్దులతో కష్టం చేపించే ప్రతి వారి హృదయాన్ని తాకింది.
నెమలియా రాజా పాటను విన్న ప్రతి ఒక్కరూ వారి ఎద్దులను గుర్తు చేసుకునేలా చేశారు. ఈ పాటలో ముఖ్యంగా గాండ్ల కులం గురించి గానుక తీయడం గురించి చక్కగా వివరించారు. పాట పాడిన మామిడి మౌనికపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె పాడిన ప్రతి పాటలో ఏదో ఒక సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ పాట విన్న ప్రతి రైతన్న కుటుంబం సంతోషంగా ఉందని, మంచి పాటను అందించారని కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన రైతన్న పాటల్లో ఒక గొప్ప పాటగా నెమలీయ రాజా సాంగ్ నిలిచిపోతుందని చెప్పవచ్చు. పల్లె వాతావరణంలో రైతులు, వారి ఎద్దులు పడే కష్టాన్ని తెలియజేశారు. పాటకు వినుసొంపైన మ్యూజిక్ అందించినందుకు మంచి స్పందన వస్తోంది. ఇలాంటి పాటలు మళ్లీ రావాలని విన్న వారంతా కోరుతున్నారు.
Song Name | Nemaleeya raja (2022) |
Lyrics | Sv Mallikteja |
Singer – Lead Cast – Costume Designer | Mamidi Mounika & Vanila Gujjeti |
Music – Direction | Sv Mallikteja |
Choreography | Anthadupula Nagaraju |
Actor’s | Thirupathi reddy – Dappu Babu -Arapeta & Dumpalapalli Villager’s |
Special Thanks to | Alala Thirupathi Reddy |
Youtube Video Song | links |
Nemaleeya raja Folk Song Mp3 Download

నెమలియా రాజ ఒరిజినల్ సాంగ్ హిట్ అయినట్టు ఇప్పుడు నెమలీయ రాజా డిజె సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ పాటకు Mahesh chinthalbori – Dj Srinu డిజె మ్యూజిక్ అందించారు. పాటకు అద్భుతమైన డిజె అందించడంతో పాటు పాటలో నాగదుర్గ తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. నాగదుర్గ గతంలో నటించిన ఉరుముల రమ్మంటిని సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ఇప్పుడు ఈ పాట కూడా ఆమె కెరీర్లో హిట్‌ను అందుకుంది.
ఊర్లలో జరిగే ప్రతి వేడుకల్లోనూ, పెళ్లి ఫంక్షన్లలోనూ, పెళ్లిళ్ల ఊరేగింపులోనూ ఈ నెమలీయ రాజా డిజె సాంగ్ మోతమోగిస్తుంది. ఎంవి మ్యూజిక్ మల్లిక తేజ ఆధ్వర్యంలో విడుదలైన ప్రతి డిజె పాటలను విన్నారంటే ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా. మొత్తంగా రెండు పాటలూ సూపర్ హిట్‌ను అందుకున్నాయి. మీరు కూడా ఒక సారి యూట్యూబ్‌లో నెమలీయ రాజా పాటను వీడియో చూడండి. పాటను డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాము.