Nelluri Nerajana Song lyrics

Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెర‌జానా నీ కుంకుమ‌ల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie

Share link

Nelluri Nerajana Song lyrics | 1999 సంవ‌త్స‌రంలో దేశ‌వ్యాప్తంగా సినిమా చ‌రిత్ర‌లో ఒక సంచ‌ల‌నంగా నిలిచిన ఒకే ఒక్క‌డు సినిమా అంద‌రికీ గుర్తే ఉంటుంది. ఆ సినిమా ప్ర‌తి ఒక్క‌రూ చూసే ఉంటారు. నేటి ప‌రిపాల‌నా విధానాల‌ను వేలెత్తి చూపుతూ పాల‌న అంటే ఇలా ఉండాల‌ని హీరో అర్జున్ ఒక్క రోజు ముఖ్య‌మంత్రి చేసి నిరూపించారు. ఆ సినిమాలో ప్ర‌తి స‌న్నివేశం ఒక అద్భుతంగా అనిపించింది. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో వ‌చ్చిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇక Oke Okkadu సినిమాలో ప్ర‌తి పాట(Nelluri Nerajana Song lyrics) ఇప్ప‌టికీ ఎక్క‌డో ఒక్క‌చోట మ‌నం వింటూనే ఉంటున్నాం.

సినిమాకు త‌గ్గ‌ట్టు పాట‌లు ప్ర‌తి ప్రేక్ష‌కుడి మ‌దిలిలో నిలిచిపోయాయి. ఇక ఎఆర్ రెహమాన్ సంగీతం అంటే ప్రాణం లెగిసి వ‌స్తున్నంత హాయిగా ఉంటుంది. Rehman అందించిన సంగీతం ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ్వ‌రూ అందించ‌లేరు. రెహ‌మాన్ సంగీత ప్ర‌పంచంలో ఈ ఒకే ఒక్క‌డు సినిమా ఒక సంచ‌ల‌నం అని చెప్ప‌వ‌చ్చు. ఈ సినిమాలో సంగీతం అందించి ఇప్ప‌టికీ అభిమానుల మ‌న్న‌న‌ల‌ను పొందుతున్నారు. సినిమాలో హీరో అర్జున్‌, హీరోయిన్ మ‌నీషా కోయిరాల న‌టించార‌నే క‌న్నా జీవించార‌ని చెప్ప‌వ‌చ్చు. అంత గొప్ప‌గా ఉన్నాయి వారి పాత్ర‌లు. మొత్తంగా సినిమాలో నెల్లూరి నెర‌జానా నీ కుంకుమ‌ల్లె మారిపోనా..(Nelluri Nerajana Song lyrics) పాట అంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఆ పాట‌కు సంబంధించిన లిరిక్స్‌ను ఇక్క‌డ అందించాము.

Song: Nelluru Nerajana

Singers: Hariharan, Mahalakshmi

Lyrics: A.M. Ratnam, Siva Ganesh

Cast: Arjun Sarja, Manisha Koirala

Director: Shankar

Producer: AM Ratnam

Music: AR Rahman

Nelluri Nerajana Song lyrics

నెల్లూరి నెర‌జానా నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు న్నాన‌మాడ ప‌సుపు లాగ న‌న్ను కొంచెం పూసుకోవే
నీ అందెల‌కు మువ్వ‌ల్లాగా న‌న్ను కొంచెం మార్చుకోవే(2)

ఒక కంట నీరొల‌కా పెద‌వెంట ఉసురొల‌క‌
నీవ‌ల్ల ఒక ప‌రి జ‌న‌నం ఒక ప‌రి మ‌ర‌ణం అయిన‌ది
అరె పారేటి సెల‌యేరు అల సంద్రాన క‌లిసిన‌ట్టు
గుండె నీ తోడుగా వెంటాడెలే అరె క‌లం మ‌రిచి
అడ‌వి చెట్టు పూచెనులే!!

నెల్లూరి నెర‌జానా నే కుంకుమ‌ల్లె మారిపోనా
నువ్వు స్నాన‌మాడ ప‌సుపు లాగ న‌న్ను కొంచెం పూసుకోవే
నీ అందెల‌కు మువ్వ‌ల్లాగ న‌న్ను కొంచెం మార్చుకోవే

జొన్న కంకి ధూలే ప‌డిన‌ట్టు
క‌న్నుల‌లో దూరి తొల‌చితివే
తీగ వ‌దిలొచ్చిన మ‌ల్లిక‌వే
ఒక‌మారు న‌వ్వుతూ బ‌దులీవే
పెద‌వి పై పెద‌వుంచి మాట‌ల‌ను జుర్రుకొని
వేళ్ల‌తో వ‌త్తిన మెడ‌పై ర‌గిలిన తాప‌మింక పోలేదు

అరె మెరిసేటి రంగు నీది
నీ అందానికెదురురేది
నువ్వు తాకేచోట తీపెక్కులే
ఇక ఒళ్లు మొత్తం చెయ్య‌వ‌లెను పుణ్య‌ములే

నెల్లూరి నెర‌జానా నే కుంకుమ‌ల్లె మారిపోనా
నువ్వు స్నాన‌మాడ ప‌సుపు లాగ న‌న్ను కొంచెం పూసుకోవే
నీ అందెల‌కు మువ్వ‌ల్లాగా న‌న్ను కొంచెం మార్చుకోవే

ఒక ఘ‌డియ కౌగిలి బిగియించి నా ఊపిరాప‌వే ఓ చెలియా
నీ గుండె లోగిళ్ల‌నే చేర న‌న్ను కొంచెం హ‌త్తుకో చెలికాడా
చినుకంటి చిరు మాట‌.. వెలుగంటి ఆ చూపు
దేహ‌మిక మ‌ట్టిలో క‌లిసిపోయే వ‌ర‌కు ఓర్చును
ప్రాణం నా చెంత‌నుండంగా నువ్వు మ‌ర‌ణించి పోవుటెలా
అరె నీ జీవ‌మే నేనేన‌యా
చంప‌ద‌ల‌చు మ‌ర‌ణ‌మైన మాయ‌మాయా!!

నెల్లూరి నెర‌జానా నే కుంకుమ‌ల్లె మారిపోనా
నువ్వు స్నాన‌మాడ ప‌సుపు లాగ న‌న్ను కొంచెం.. పూసుకుంటా
నీ అందెల‌కు మువ్వుల్లాగా న‌న్ను కొంచెం..మార్చుకుంటా

Porata Simham Lyrics | Vikram Movie Telugu | Kamal Haasan | పోరాట సింహం

Porata Simham Lyrics | Vikram Movie Telugu Song Name: Porata Simham Movie: Vikram (2022) lyrics: Krishna kanth Composed by: Anirudh Read more

Life Ante Itta Vundaala Lyrics F3 Movie | Venkatesh, Varun Taj, Pooja Hegde

Life Ante Itta Vundaala Lyrics: Hero Daggubati Venkatesh, Varun Tej, Tamanna, Mehreen Pizada, Pooja Hegde Casting by F3 Telugu Movie. Read more

Oo Aadapilla Lyrics Telugu: ఓ ఆడపిల్లా నువ్వ‌ర్థం గావా నా జీవితంతో ఆటాడుతావా | Ashoka Vanamlo Songs

Oo Aadapilla Lyrics Telugu: ఓ ఆడపిల్లా నువ్వ‌ర్థం గావా నా జీవితంతో ఆటాడుతావా | Ashoka Vanamlo Songs Movie: Ashoka Vanamlo Arjuna Kalyanam Read more

Yeme Pilla Song Lyrics Telugu: ఏమే పిల్ల అన్న‌ప్పుడ‌ల్లా

Yeme Pilla Song Lyrics Telugu: ఏమే పిల్ల అన్న‌ప్పుడ‌ల్లా..పాట‌కు సంబంధించి కింద తెలుగులో లిరిక్స్ అంద‌జేశాము. ఈ పాట‌ను సింగ‌ర్ Shirisha సూప‌ర్‌గా పాడారు. ఈ Read more

Leave a Comment

Your email address will not be published.