Neem beauty benefits

Neem beauty benefits: సౌంద‌ర్య సుగుణాల వేప‌తో అందం మీ సొంతం!

Health Tips

Neem beauty benefits | వేప ఆరోగ్యానికే కాదు..అందాన్నీ ద్విగుణీకృతం చేస్తుంది. కాల‌మేదైనా దీన్ని సౌంద‌ర్య సాధ‌నంగా ఉప‌యోగిస్తే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు దూర‌మై మేని మెరుపులు సొంతం కావ‌డం ఖాయం.

ఈ కాలంలోనూ ఎండ ప్ర‌భావం, వేడి ఉంటుంది. అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావం వ‌ల్ల క‌ళ త‌ప్పిన మేని కాంతిమంతంగా త‌యారు కావాలంటే, వేపాకుల‌ను మెత్త‌గా నూరి పూత‌లా వేయాలి. అర‌గంట‌య్యాక ఆయుర్వేద గుణాలున్న స‌బ్బుతో స్నానం చేస్తే చ‌క్క‌టి ప‌రిష్కారం ల‌భిస్తుంది. వేప చెక్క‌ను తీసుకొని గ‌ర‌కు రాయి మీద నూరి అందులో కొద్దిగా చంద‌నం పొడి, కాసిని నీళ్లు చేర్చి ముఖానికి పూత‌లా వేసుకోవాలి. తేమ ఆరాక చ‌ల్ల‌టి నీళ్ల‌తో శుభ్ర ప‌ర‌చుకుంటే మృత‌క‌ణాలు తొలిగిపోయి మేని ప్ర‌కాశవంతంగా మారుతుంది. అంతేకాదు న‌ల్ల‌మ‌చ్చ‌లు, ద‌ద్దుర్లు ఉన్న‌ప్పుడు వారానికి రెండు సార్లు ఈ నియ‌మం పాటిస్తే ప‌రిష్కారం(Neem beauty benefits) ల‌భిస్తుంది.

సౌంద‌ర్య సుగుణాల వేప‌

గుప్పెడు వేపాకుల‌ను తీసుకొని ముద్ద‌గా చేసి అందులో కొద్దిగా ప‌సుపు, రెండు చెంచాల ట‌మాటా ర‌సం చేర్చి మిశ్ర‌మం త‌యారు చేయాలి. దీన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి ముఖం, మెడ‌, చేతుల‌కు రాసుకోవాలి. పావు గంట‌య్యాక క‌డిగేసుకోవాలి. త‌రుచూ ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై న‌ల్ల‌మ‌చ్చ‌లు, మురికి, క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు దూర‌మ‌వుతాయి. ఎండ బెట్టిన వేపాకులు, ఎర్ర‌కందిపప్పును మెత్త‌గా పొడి చేసి అందులో ప‌సుపు, చెంచా తేనె క‌లిపి శ‌రీరానికి న‌లుగులా పెట్టుకోవాలి. కొద్ది సేప‌య్యాక గోరువెచ్చ‌టి నీళ్ల‌తో స్నానం చేస్తే మేని శుభ్ర‌ప‌డి, ఒత్తిడి మాయ‌మ‌వుతుంది. ఒంటికి న‌లుగు పెట్టుకునే ముందు వేప నూనెతో మ‌ర్థ‌న చేసుకుంటే అల‌ర్జీ, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల వంటివి ద‌రిచేర‌కుండా ఉంటాయి.

వేపాకులు వేసి మ‌రిగించిన నీళ్ల‌ను నిల్వ చేసి ఫేస్‌ప్యాక్‌ల త‌యారీలో మామూలు నీళ్ల‌కు బ‌దులుగా వాడితే చ‌ర్మ‌సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు. మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు వేపాకులు, దానిమ్మ పొట్టును స‌మాన ప‌రిమాణంలో తీసుకొని మెత్త‌గా చేసి కాసిని పాలు క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమ‌ల స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం దొరుకుతుంది. త‌ల్లో చెమ‌ట‌, చుండ్రు, జుట్టురాలే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి వేపాకుల‌తో చ‌క్క‌టి ప‌రిష్కారం ల‌భిస్తుంది.

అంద‌మైన ఫేస్‌

అందుకేం చేయాలంటే.. బ‌కెట్ నీళ్ల‌లో కొన్ని ఆకుల‌ను వేసి మ‌రిగించి గోరువెచ్చ‌గా అయ్యాక వాటితో త‌ల‌స్నానం చేయాలి. నెల‌కు రెండు మూడు సార్లు ఇలా చేయ‌డం మంచిది. వేప నూనెను ముందు రోజు మాడుకు మ‌ర్థ‌న చేసి మ‌ర్నాడు త‌ల‌స్నానం చేయాలి. త‌రుచూ ఇలా చేస్తే పొడి బారిన శిరోజాల‌కు తేమ అందుతుంది. పేల స‌మ‌స్య ఉంటే క్ర‌మంగా దూర‌మ‌వుతుంది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *