Neeli Neelakantuda mp3 Song: మహా శివరాత్రి వచ్చిదంటే కచ్చితంగా మంగ్లీ(Mangli) నోట శివరాత్రి పాట వినాల్సిందే. ప్రతి ఏడాది శివరాత్రి పండుగకు ఒక పాట తన సొంత మంగ్లీ అఫిసియల్ యూట్యూబ్ ఛానెల్ నుండి విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం నీలి నీలకంఠుడా అనే పాట మంగ్లీ విడుదల చేశారు. తన గానంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జానపద గేయ కళాకారుల్లో మంగ్లీ ఒకరని(Neeli Neelakantuda mp3 Song) చెప్పవచ్చు.
మంగ్లీ స్వరంను నచ్చని వారు ఉండరు. ఆమె పాడిన పాటను వినకుండా కూడా ఉండరు. అద్భుతమైన గాత్రంతో శివుడు పాటలు పాడుతూ భక్తులకు శివరాత్రి పండుగ వైభవాన్ని తెలియజేస్తున్నారు మంగ్లీ. గత ఏడాది 2021లో వచ్చిన Sadhu Sangama Aadi Devuda పాట ఒక సంచలనం సృష్టించింది. ఆ పాటతో గతేడాది మహాశివరాత్రి వైభవాన్ని కళ్లకు చూపించారు మంగ్లీ.
ఇప్పుడు విడుదలైన నీలి నీలకంఠుడా సాంగ్ కూడా చాలా బాగుంది. పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. పాటను మంగ్లీ పాడటంతో పాటు యాక్టింగ్ చేశారు. సంగీతాన్ని మదీన్షేక్ అందించారు. ఈ పాటను యూట్యూబ్‌లో విన్నవారందరూ ఇంత మంచి పాటను అందించిన మంగ్లీకి అభినందలు, శతకోటి వందనాలు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే మంగ్లీ శివరాత్రి పాట కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు, భక్తులకు ఈ పాటతో ఈ ఏడాది కూడా వారి కల నెరవేరిందనుకోవచ్చు.
మంగ్లీ పాడిన పాటలు తెలుగులో అయినప్పటికీ తమిళంలోనూ, కన్నడంలోనూ మరియు ఇతర భాషలకు చెందిన వారు సైతం వినడం ఒక గొప్ప విశేషం. మంగ్లీ ఇప్పటికే బతుకమ్మ పాటలు, రాజకీయ పాటలు, సినిమా పాటలు పాడి తన కెరీర్లో తిరుగులేని సింగర్‌గా నిలిచారు. శివరాత్రి పాటలతో అభిమానులకు, భక్తులకు మరింత చేరువయ్యారు. ఈ పాట వీడియో చూడాలన్నా, డౌన్లోడ్ చేసుకోవాలన్నా క్రింద లింక్ ఉన్నది.
Song Name: Neeli Neelakantuda
Lyrics: KasarlaShyam
Singer: Mangli
Music: MadeenSK
DOP: Tirupati
Editing: Uday Kumbham
Asst. Editor: AshokKarri
Asst. Camer: Paramesh
Poster: MittuAretty
DI: Sanjeev
ఈ పాట వీడియో చూడాలంటే లింక్‌ను క్లిక్ చేయండి
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!