AP New Sec : బాధ్యతల రోజునే పరిషత్ ఎన్నికలపై ఫోకస్!
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరణ
AP New Sec : : ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలియజేశారు. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషన్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్డు ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్ ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించారు. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించించేందుకు ఆమె పేరును గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఖరారు చేశారు.
ఏపీలో పరిషత్ ఎన్నిలకు సిద్ధం!
ఏపిలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎస్ఈసీగా ఇవాళ ఉదయం బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు నిర్ణయించారు. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యదర్శి కన్నబాబుతో దీనిపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో ఎస్ఈసీ కార్యాలయంలో నీలం సాహ్ని భేటీ అయి ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
గురువారం సాయంత్రం 4 గంటలలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతోనూ, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీ పాల్గొని ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత ఎస్ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.


పరిషత్ ఎన్నికలకు గతేడాది మార్చి 7న నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత కోవిడ్ ఉగ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 15వ తేదీన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఎన్నికలను తిరిగి కొనసాగించాలని నీలం సాహ్ని నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తూ సాయంత్రం ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court