Neela Neelammu: Suman Folk Music నుంచి విడుదలైన ఏ పాటైనా హిట్‌ను అందుకోవాల్సిందే, ఫేవరెట్ సాంగ్కుగా నిలిచిపోవాల్సిందే అన్నట్టు ఉంటాయి మరి. తెలంగాణ జానపద సింగర్స్‌లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమన్ బదనకల్ (Suman Badanakal) సాంగ్స్ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా పల్లెటూరు కుర్రకారును ఇవి ఫ్యామస్ పాటలుగా నిలిచిపోయి. ఇప్పటి వరకు సుమన్ రాసిన, పాడిన ప్రతి పాట సంచలనమైన హిట్‌ను అందుకున్నాయి.
అదే కోవలో ప్రేక్షకులు అత్యంతగా ఇష్టపడిన పాట నీలా నీలమ్ము సిరలో నీలా ఫోక్ సాంగ్ 2022 ఈ ఏడాది ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. సుమన్ బదనకల్ ఆధ్వర్యంలో వచ్చిన నీలా నీలమ్ము సిరలో నీలా సాంగ్ పార్ట్ 1, 2 విడుదలయ్యాయి. ఇప్పుడు మనం చెప్పుకునే సాంగ్ పార్ట్ 2. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలై ప్రతి ఒక్కరి మనసును ఆనందింపజేసింది ఈ Song. సుమన్ పాటలు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ప్రేక్షకుల మనసును గెలుచుకుంటున్నాయి.
Neela Neelammu Siralo Neela Folk Song కు లిరిక్స్ సుమన్ బదనకల్ అందించడంతో పాటు పాటను పాడారు. ఫీమేల్ సింగర్‌గా మాట్ల సృజన పాడారు. వీరి ఇద్దరి కాంబినేషన్లో చాలా పాటలు విడుదలై సూపర్ హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సాంగ్ కూడా ప్రతి ఒక్కరికీ నచ్చింది. కళ్యాణ్ కీస్ సంగీతంతో మైమరిపించారు. వినుసొంపైన సంగీతాన్ని అందించి పాటను అర్థవంతంగా వినిపించేలా చేశారు. ఈ పాటను Chikod Village లో చిత్రీకరించారు. సుమన్ – బ్రహ్మరాంబిక కాంబినేషన్లో అద్భుతమైన నటనతో అదరగొట్టారు.
నీలా నీలమ్ము సిరలో నీలా ఫోక్ సాంగ్‌ను ఇప్పటికీ Youtube లో రోజుకు వందల సంఖ్యలో చూస్తూ ఆనందిస్తున్నారు. పాటను ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదని, మంచి సాహిత్యంతో పాటు, సంగీతం అందించి అద్భుతమైన పాటను విడుదల చేశారని చెబుతున్నారు. ఈ పాటలో సుమన్ జానపద సాహిత్యాన్ని అద్భుతంగా రాశారు. లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారని అంటున్నారు. ఇంకా పల్లెటూర్లలో ఉన్న ట్రాక్టర్ల డ్రైవర్ల అన్నలు ఈ పాటను మారు మ్రోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ట్రాక్టర్ మీద వచ్చే పాటలో సన్నివేశాలను సోషల్ మీడియాలో కూడా పెట్టుకుంటున్నట్టు కామెంట్ చేస్తున్నారు.
వాస్తవానికి సుమన్ బదనకల్ నాడు ఉద్యమ సమయంలో కూడా తన గానంతో ఎన్నో పాటలు పాడి తెలంగాణ ప్రజలకు సుపరిచితుడుగా ఉన్నారు. ఇప్పుడు మంచి మంచి లవ్ సాంగ్స్‌తోను, తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో వేల కొలది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ప్రతి పాటలో తన కంటూ గుర్తింపు తెచ్చుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఇప్పటికీ నీలా నీలమ్ము సిరలో సాంగ్ పార్ట్ 1 కూడా చాలా బాగుంది. ఇప్పుడు పార్ట్ 2 సాంగ్ బాగుందని ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదని చెబుతున్నారు.
Neela Neelammu Song Credits
Song Name | NEELA NEELAMMU |
Lyrics – Singer | Suman Badanakal |
Female Singer | Matla Srujana |
Music | Kalyan Keys |
Direction | Naveen Badanakal |
Youtube Video Song | Link |