Needi kani rupamedi ledu | ఈ Shivaratri 2022 సంవత్సరానికి సింగర్ మంగ్లీ మరో పాటతో ప్రేక్షలను అలరించనుంది. ప్రముఖ మాటల మాంత్రికుడు, గాయకుడు మిట్టపల్లి సురేందర్(Mittapalli Surender) ఆధ్వర్యంలో నీది కాని రూపమేమి లేదు దేవా ఈ సృష్టిలో(Needi kani rupamedi ledu)..అంటూ ఓ శివరాత్రి సాంగ్ ప్రొమో మంగ్లీ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ నుండి విడుదల చేశారు. ఈ పాట ప్రొమోను ఇప్పటికే లక్షలాది మంది చూసి విన్నారు. పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది.
భక్తి గీతాలు పాడటంతో తనకంటు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సింగర్ మంగ్లీ తన గానంతో మరోసారి శివ భక్తులను మంత్రముగ్దులను చేసేందుకు రెడీ అయ్యారు. పాట ప్రొమో ఒక నిమిషం ఉన్నప్పటికీ పాట ఎంత బాగుంటుందో ఇప్పటికే అభిమానులకు, భక్తులకు అర్థమైంది. పాట కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.
మంగ్లీ పాడిన ప్రతి పాటకు తిరుగుండదు. ఆమె పాడిన బతుకమ్మ పాటలు గానీ, రాజకీయ పాటలు గానీ, సినిమా పాటలు, ప్రత్యేక పాటలు ఇలా వందలాది పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక శివరాత్రి సందర్భంగా ఆమె ప్రతి ఏడాది పాడుతున్న ఓ పాట యూట్యూబ్‌లో ఒక సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది శివరాత్రి 2022కి ఆమె పాట శివరాత్రి రోజున కన్నుల పండుగ చేయనుంది. మంగ్లీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయని, శివరాత్రి నాడు నీ గానం లేకుంటే అస్సలు శివరాత్రి లా ఉండదని అభిమానులు, శివ భక్తులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక పాట లిరిక్స్, సంగీతం, మంగ్లీ పాడిన తీరు చూస్తుంటే పూర్తి పాట ఎప్పుడు వస్తుందా? అని వెయ్యి కళ్లతో ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. శివరాత్రి నాడు ఎన్ని పాటలు విడుదలైనా మంగ్లీ స్వరంతో పాట వస్తుంటే అది వినుసొంపుగాను భక్తి పరవశించినట్టు ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే తన కంటూ గుర్తింపు తెచ్చుకుని ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు భారత దేశంలోనూ ప్రత్యేక గౌరవ ప్రదమైన సింగర్‌గా మంగ్లీ ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇంకా మరిన్ని పాటలతో మనల్ని అలరించాలని..కోరుకుంటూ అభినందనలు తెలియజేద్దాం!.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!