NDA Vice President Jagdeep Dhankhar: ఎన్డీయే అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ పేరు ఖరారు చేసింది అధిష్టానం. శనివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. అనంతరం జగదీప్ ధన్ఖర్(Jagdeep Dhankhar) పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు నడ్డా ప్రకటించారు. బెంగాల్ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీకి ఎలాగైనా చెక్ పెట్టడం కోసమే ధనకర్ పేరును భారతీయ జనతా పార్టీ ఖరారు చేసిందనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
NDA Vice President Jagdeep Dhankhar
రాజస్థాన్ లోని కిథానా కు చెందిన జగదీప్ ధన్ఖర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. కిథానా అనే కుగ్రామంలో రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. ఈయన యూనివర్శిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1989 సంవత్సరంలో ఝుంఝను నుంచి జనతాదళ్ తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. జగదీప్ కేంద్ర మంత్రిగానూ పని చేశారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు న్యాయవాదిగా, రాజస్థాన్ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సేవలందించారు. బెంగాల్ గవర్నర్గా 2019 జూలై 30న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించారు.
బీజేపీ తొలుత ఎన్డీయే ఉపరాష్ట్రపతి రేసులో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ని ప్రకటిస్తారని అనుకున్నారు అందరూ. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తెల్లారే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవడం, రాజసభ్యకు ఆయనను రెన్యూవల్ చేయకపోవడంతో నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తారని అనుకున్నారు. కానీ శనివారం జరిగిన రాజకీయా సమీకరణాల నేపథ్యంలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖర్ పేరును ప్రకటించింది.


కాగా ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించి జూలై 5వ తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 19 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ కాగా జూలై 20వ తేదీ నామినేషన్లను పరిశీలించ నున్నారు. జూలై 22న నామినేషన్లను ఉపసంహరణకు చివరి రోజుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆగష్టు 6, 2022 న నామినేషన్ల ఉపసంహరఖు చివరి రోజు కానుంది. ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.