Nature: మీ పిల్ల‌ల‌కు ప్ర‌కృతిని ప‌రిచ‌యం చేస్తున్నారా?

Nature: ఒత్తిడితో కూడుకున్న చ‌దువులూ కంప్యూట‌ర్ల‌కే ప‌రిమిత‌మైన ఆట‌లూ, పిల్ల‌ల్ని మాన‌సికంగా, శారీర‌కంగా ఒత్తిడికి లోను చేస్తాయి. దీనికి ప‌రిష్కారం ఏమిటంటే..

మీ చిన్నారుల‌కు ప్ర‌కృతి (Nature) ని ప‌రిచ‌యం చేయండి. ఆట‌పాట‌లు వారి జీవ‌న‌శైలిలో భాగ‌మ‌ య్యేలా చూడండి. చిన్న‌ప్పుడు మీరు ఆడుకున్న ఆట‌లూ, చూసిన గుర్తులూ ఇప్ప‌టికీ మీకు మ‌ధుర స్మృతులుగా మిగిలే ఉంటాయి క‌దా!. అటువంటి తీపి జ్ఞాప‌కాలు మీ చిన్నారుల‌కూ ఉండేట్టు చూడండి. పంట పొలాల‌కు తీసుకెళ్ల‌డం, నీళ్ల‌తో ఆడుకోవ‌డం, వ‌ర్షంలో త‌డ‌వ‌డం వంటి ఆనందాన్ని ప‌రిచ‌యం చేయండి. ఇవ‌న్నీ వారిలో ఒత్తిడిని దూరం చేస్తాయి. ప్ర‌కృతితో అనుబంధాన్ని పెంచుతాయి.

Nature: తీరిక దొరికితే చాలు..

తీరిక దొరికితే ఇంట్లో నేష‌న‌ల్ జాగ్ర‌ఫిక్ ఛాన‌ల్ పెట్టుకుని జంతువుల్ని చూడ‌టం చాలా మంది పిల్ల‌ల‌కి అల‌వాటు. వాళ్ల‌ని ద‌గ్గ‌ర్లోని జూకి తీసుకెళ్లండి. ఓ రోజంతా అక్క‌డ గ‌డిపిరండి. వాటి జీవ‌న‌శైలి, అల‌వాట్లూ, ప్ర‌కృతితో వాటికున్న అనుబంధం తెల‌పండి. వ‌ర్షం ప‌డిన‌ ప్పుడు నెమ‌లి నాట్యం చేయ‌డం వంటివి వివ‌రించండి. పిచ్చుక‌లూ, పెంపుడు కుక్క‌లూ, ఆవులూ ప్ర‌కృతిలో భాగ‌మ‌ని వారికి అర్థ‌మ‌య్యేట్లు చెప్పండి. క‌చ్చితంగా మీ చిన్నారిలో బోలెడు మార్పు క‌న్పిస్తుంది.

ప్ర‌కృతి

పిల్ల‌ల్లో ఒత్తిడి త‌గ్గించేందుకు, మాన‌సిక‌, శారీర‌క సామ‌ర్థ్యం పెరిగేందుకు ఆట‌లు ఎంతో ఉప‌క‌రిస్తాయి. ఆట‌ల‌న‌గానే చేతికి మ‌ట్టి అంటుకోకుండా, శ‌రీరం క‌ద‌లకుండా ఉండాల‌నుకోవ‌ద్దు. క‌చ్చితంగా చెమ‌ట‌లు ప‌ట్టేలా ఆడుకోనివ్వండి. దీనివ‌ల్ల శ‌రీరం దృఢంగా త‌యార‌వుతుంది. వ్యాధినిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒత్తిడికి దూరంగా ఉంటారు.

Share link

Leave a Comment