Nataraj Master | Bigg Boss లో నేను మాస్క్ పెట్టుకోని ఆడలేదని, తాను నిజాయితీగా ఆడానని, నా ఫేస్ వాల్యూవుతోనే బిగ్‌బాస్లో నాకు నచ్చినట్టు ప్రవర్తించానని నటరాజ్ మాస్టర్ అన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టార్ మీడియా ఎదుట నటి బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు ఫ్యాన్స్ లేకపోవొచ్చు గానీ, నాపై అభిమానంతో ఇప్పటి వరకూ సపోర్టు చేసి Bigబాస్‌లో ముందుకు సాగడానికి సహాయ పడ్డారని అన్నారు. నా గురించి ఎంతో మంది చెడుగా మాట్లాడారని, నా మీద కామెంట్ చేసిన ప్రతి ఒక్కర్నీ వదిలి పెట్టబోనని అన్నారు.
బిగ్‌బాస్‌లో మనం వెళ్లింది ప్రజల్ని ఎంటర్మైన్‌మెంట్ చేయడానికి గానీ, మనం ఆడటానికి కాదు అని అన్నారు. Social మీడియాలో దొంగ ఓట్లు సంపాదించుకొని Bigg Boss లో కొందరు ముందుకు పోతున్నారని అన్నారు. హౌస్‌లో ప్రతి ఒక్కర్నీ ప్రేమగానే ఉన్నానని, బిందు మాధవి నన్ను అనవసరంగా అన్నందుకే నేను నోరు జారానని అన్నారు. నాకు ఒక కూతురు ఉందని, బిందు మాధవి కూడా ఒక కూతురు అనే విషయం తెలుసుకోవాలని అన్నారు. నేను బిగ్‌బాస్ హౌస్‌లో సింహంలాగా ఆడానని అన్నారు.
Bigg Boss Houseలో నాతో మంచిగా ఉన్నట్టు నటించి చివరకు నన్ను సపోర్టు చేయని వారుకూడా ఉన్నారని, ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని, తన పోరాటం ఆగబోదని Nataraj Master సవాల్ విసిరారు. hotstarలో చూసే వాటికన్నా బయట వారికి ఎక్కువ ఓట్లు ఉన్నాయంటే వారు దొంగ సోషల్ మీడియా అకౌంట్లు పెట్టి ముందుకు సాగుతున్నారని అన్నారు. తనను హౌస్ నుంచి బయటకు పంపించడానికి వారు కంకణం కట్టుకున్నారని అన్నారు. తనకు బయటకు వచ్చిన తర్వాత నాకు అభిమానులు ఇంత మంది అండగా ఉండటం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక నుంచి అక్కడ జరిగిన ప్రతి ఒక్కటీ యూట్యూబ్ ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.