

యుద్ద ట్యాంకర్‌పై ప్రధాని మోడీ
Narendra Modi Telugu News | దేశంకు దీపాలై వెలుగు నిస్తున్న సైన్యంకు దీపావళి శుభాకాంక్షలు జైసల్మేర్ : సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న వీర జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి పండుగ జరుపుకున్నాఉ. శనివారం ఉదయం రాజస్థాన్ లోని జైసల్మేర్ వెళ్లిన ప్రధాని అక్కడ లోంగేవాలా పోస్ట్ లోని జవాన్లను కలిశారు. సైనికులకు మిఠాయిలు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యుద్ధ ట్యాంకర్‌పై ప్రయాణించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను భారతీయ జనతాపార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. మోడీ యుద్ధ ట్యాంకర్‌పై ప్రయాణించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సైనికులనుద్ధేశించి ప్రసగించిన మోడీ, శత్రుదేశాలకు గట్టి హెచ్చరికలు చేశారు. సరిహద్దుల్లో భారత్ సహనాన్ని పరీక్షిస్తే సరైన జవాబు తప్పదని హెచ్చరించారు. దేశ భద్రత, ప్రయోజనాలపై భారత్ ఎన్నటికీ రాజీపడబోదని స్పష్టం చేశారు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోడీ ఏటా దీపావళి పండుగను జవాన్లతో చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.