Lockdown పెట్టకుండా ఉండాలంటే.. ప్రధాని Modi Speech!
Modi Speech: లాక్డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా నుంచి లాక్డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమతమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మోడీ మంగళవారం జాతినుద్ధేశించి ప్రసంగించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నుంచి దేశం బయటపడటానికి ఏమేం చేయాలో ప్రధాని సూచించారు.
ముఖ్యంగా లాక్డౌన్ అనేది ఆఖరి అస్త్రంగానే చూడాలన్నారు. కరోనా నుంచి లాక్డౌన్ విధించకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న యువత ముందుకు వచ్చి తమతమ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేసుకుని కరోనా నిబంధనలు అందరూ పాటంచేలా చూడాలని పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ఎన్నో సవాళ్లు విసురుతోందని ప్రధాని అన్నారు. అయితే, ఆ సవాళ్లను మనం ఎదుర్కోవడానికి కొన్ని సూచనలు చేశారు. అత్యంత కఠిన సమయాల్లో మనం ధైర్యం కోల్పోకూడదని శాస్త్రాల్లో ఉందని, అలా ధైర్యం కోల్పోకుండా సరైన దిశలో ముందుకు సాగితే మనం కరోనా మీద విజయం సాధిస్తామని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.


దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత ఉందని మోడీ అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరా కోసం అనేక చర్యలు తీసుకున్నామని , పలు ప్లాంట్లు నెలకొల్పామని తెలిపారు. వైద్య అవసరాల కోసం ఔషధాల ఉత్పత్తి పెంచామని, ఫార్మా పరిశ్రమలు త్వరిత గతిన మెరుగైన వ్యాక్సిన్లు అందిస్తున్నామని ప్రధాని అన్నారు. దేశంలో 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందిందని ప్రధాని తెలిపారు. మే 1 వ తేదీ నుంచి 18 సంవత్సరాలు నిండిన పౌరులందరకీ టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రెండు కోవిడ్ టీకాలు తయారయ్యాయని, వీటి సాయంతో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ కార్యక్రమం ఇండియాలో కొనసాగుతుందని మోడీ అన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించిన కేంద్రం!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం మరోసారి హెచ్చరించింది. రానున్న మూడు వారాలు చాలా కీలకమని, కరోనా వ్యాప్తి నివారణ కోసం ముందస్తు ప్రణాళికలు రక్షించుకోవాలని సూచించింది. కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పోలీసు అధికారులతో నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే మూడు వారాల్లో కరోనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉండటంతో ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాజిటివ్ కేసులు గుర్తించేలా నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో కోవిడ్ 19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తదితర ఉన్నతాధికారులతో వీకేపాల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 రెట్లు కంటే ఎక్కువుగా పెరిగినట్టు అజయ్‌కుమార్ తెలిపారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం