Nara Rohit కుప్పం: నారావారిపల్లెలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళ్లర్పించి(Nara Rohit) భైటాయించారు.
తమ పెద్ద నాన్న చంద్రబాబు నాయుడు, పెద్దమ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్‌కు ఆదర్శంగా నిలిచారన్నారు. అన్న ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబ ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, గడప దాటలేదని పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదన్నారు. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. జీవితంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి నేతలు మనసు గాయపర్చినప్పటికీ భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తుపాను బాధితులకు సహాయ, సహకారాలు అందిస్తూ ఆపన్నులకు అండగా నిలుస్తుందన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే సహించేది లేదని నారా రోహిత్ హెచ్చరించారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?