Nara Lokesh : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు
Nara Lokesh : పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే ప్రమాదముందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాలు పరీక్షల రద్దు లేదా వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయని వైసీపీ ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల వాయిదాకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్లైన్ సమావేశాన్ని లోకేశ్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతోందని లోకేశ్ అన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని హితువు పలికారు.
ఏపీలో ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి : అచ్చెన్న
ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య తగదని ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కరోనా దెబ్బకు ఉపాధ్యాయులు బతుకులు దుర్భరంగా మారాయని అన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకు 25 మంది ప్రైవేటు టీచర్లు మృతి చెందినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అచ్చెన్న ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని ఒక్కొకర్కికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started