Polavaram project: హైదరాబాద్: పోలవరం నిర్వాసితుల్ని పరామర్శించటానికి మంగళవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram project) కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు ఉండటానికి ఇళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక దయనీస్థితిలో ఉన్నారని అన్నారు.
ప్రభుత్వం తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని నిర్వాసితులు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు పరిశీలించేందుకు తెలుగు దేశం పార్టీ ముందడుగు వేస్తుందన్నారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసిత గ్రామాలలో పర్యటించనున్నారు నారా లోకేష్.
ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 10.30 నిమిషాలకు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రమూర్తిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకూ తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో నిర్వాసితుల సమస్యలు తెలుసుకుంటారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వీఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామం కొండపైన నిర్వాసితులు, ఆదివాసీల ఆవేదన విననున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి చింతూరులో నిర్వాసితులతో మాట్లాడతారు.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?