Twitter : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ వలస కార్మికుడు కరోనాతో మృతి చెందడంపై నారా లోకేష్ స్పందించారు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఫోన్ చేసినా బెడ్ లేదని, చనిపోతే స్మశానంలో పాడె లేదని ఆరోపించారు.
Twitter : ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కాదు కదా! కనీసం చనిపోతే స్మశానంలో పాడె కూడా దొరకడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలిపారు. సోమవారం ఆయన ట్విట్టర్(Twitter) ద్వారా స్పందిస్తూ… కరోనా(corona) పంజాకు ఆంధ్రప్రదేశ్ శవాల గుట్టగా మారుతుంటే అభినవ్ నీరో చక్రవర్తి జగన్రెడ్డి తాడేపల్లిలో వారి ఇంట్లో తన వ్యక్తిగత ఫిజియోథెరఫిస్ట్(physiotherapist) , తిరుపతి ఎంపి గురుమూర్తి(MP Gurumurthy)కి శాలువాలు కప్పుతున్నారని విమర్శించారు. విజయవాడలో ఊరేగించి విజయసాయిరెడ్డి అల్లుడికి కట్నంగా చదివించిన 104, 108 అంబులెన్స్లేవి అని ప్రశ్నించారు. విజయవాడలోని కరోనా సోకిన వలసకూలి అసిరినాయుడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోని ఆరోగ్యశాఖకి ఏం అనారోగ్యం వచ్చిందని విమర్శించారు. వలసొచ్చిన నగరం పొమ్మంటే, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సొంతూరు జి.సిగడాం మండలం కొయ్యానపేట పల్లెకి పోతే, స్థానికులు ఊర్లోకి రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేవారు. కనీసం వాలంటీర్లు పట్టించుకోకుండా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. భార్య పిల్లల ముందే అసిరినాయుడు అనాథలా కన్నుమూశాడని తెలిపారు. మానవత్వం లేని ముఖ్యమంత్రి జగన్ వల్ల, చేతకాని పాలన వల్లే అకాలపు చావలు వస్తున్నాయని లోకేష్ విమర్శించారు.


హిందూపురంలో రోగుల మృతి బాధాకరం: పరిటాల సునీతమ్మ
అనంతపురం: జిల్లాలోని హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగుల మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. రోగులకు ఆక్సిజన అందించలేని సీఎం జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదని విమర్శించారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకున్న మరణాలు ప్రభుత్వా హత్యలేనని ఆరోపించారు. ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం బాధను కలిగించిందన్నారు. రెండు రోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలో 12 మంది మృతి చెందారన్నారు. మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


కరోనా బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్న వారికి కనీసం ఆక్సిజన్ కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వమిదని అన్నారు. ఆక్సిజన్ అందక ప్రజలు బలవుతుంటే సీఎం జగన్మోహన్రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోని చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి అసమర్థతకు, వైసీపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి మరెంత మంది బలికావాలని ప్రశ్నించారు. అనంతపురం సర్వజన ఆస్పత్రి, కర్నూలు కేఎస్ కేర్ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక ఇప్పటికే 26 మంది కి పైగా చనిపోయారన్నారు. కరోనా సోకిందనే బాధ కంటే ఆక్సిజన్ దొరకుతుందా లేదా? అనే ఆందోళన రోగులను మరింత కుంగదీస్తోందన్నారు. ఎంతసేపూ ప్రత్యర్థులను ఎలా ఇబ్బంది పెటాలి? మోసపూరిత మాటలతో రాజకీయ పబ్బం ఎలా గడుపుకోవాలి? అనే వాటిపైనే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. కరోనా మొదటి దశ ఉధృతి సమయంలోనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటిలేటర్లను అందజేస్తే వాటిని ఇంత వరకూ ఆస్పత్రిలో అమర్చనే లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో కరోనా రోగుల ప్రాణాలను కాపాడాలని సూచించారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court