Nandigama Student Suicide | తండ్రి తీసుకున్న అప్పు చెల్లించాలని Recovery Agents తన కుటుంబాన్ని వేధిస్తుండటంతో అవమానంగా భావించి చివరకు స్టూడెంట్ హరిత ఆత్మహత్య చేసుకోవడం ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలో సంచలనం రేపింది. నిన్న జరిగిన ఈ విషాధ సంఘటనపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు రంగంలోకి దిగారు. నందిగామ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Student Haritha సూసైడ్ ఘటనతో నందిగామలో మరోసారి రికవరీ ఏజెంట్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. రికవరీ ఏజెంట్ల వేధింపులతో హరిత ఆత్మహత్య చేసుకుందని నిర్థారణ కావడంతో నలుగురి రికవరీ ఏజెంట్లపై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తుండగానే ఆ నలుగురు ఆఫీసుకు తాళం వేసి పరారీలో ఉన్నారు. అయితే నందిగామ పరిసర ప్రాంతాల్లో రికవరీ ఏజెంట్ల వేధింపులు తారస్థాయికి చేరాయని జనాలు అనుకుంటున్నారు.
Personal Loan, బైక్ ఫైనాన్స్, ఇల్లు ఫైనాన్స్, ఇతర Finance తీసుకున్న వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వేధింపులకు గురిచేస్తున్న రికవరీ ఏజెంట్లపై ఇక నుంచి నిఘా వేసే పరిస్థితి ఉంది. అదే విదంగా వీక్లీ ఫైనాన్స్ వ్యాపారస్తులు కూడా ఇంటింటికి తిరిగి వడ్డీలకు డబ్బులు ఇచ్చి తర్వాత అధిక వడ్డీ వసూలు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ రికవరీ ఏజెంట్ల ఆగడాలపై నందిగామ డిఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.


Nandigama Student Suicide | ఇంజినీర్ కావాల్సిన హరిత చివరకు ఇలా!
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన హరిత. ఇటీవల వచ్చిన ఎమ్‌సెట్ ఫలితాల్లో 15 వేల ర్యాంకు తెచ్చుకుంది. ఇంజినీర్ కావాలని కలలు కన్న ఆ యువతి ఇలా అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది. బ్యాంకు నుంచి తన తండ్రి మూడు లక్షలు అప్పు తీసుకున్నారని అది సకాలంలో చెల్లించకపోవడంతో రికవరీ ఏజెంట్లు బెదిరించారని హరిత తల్లి ఆరోపిస్తున్నారు. ఇంటికొచ్చి అప్పు చెల్లించకపోతే బజారుకీడుస్తానని బెదిరించడంతో, తీవ్ర మనస్థాపానికి గురైన కూతురు హరిత ఓ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులు ఆవేదనతో చెబుతున్నారు.