Nandigama Circle | ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం Gollamudi గ్రామంలో హత్య ఘటన సంచలనం రేపింది. గ్రామానికి చెందిన భూ లక్ష్మికి అనారోగ్యం బాగాలేదని కారణంతో విజయవాడ బైక్‌పై తీసుకెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భార్యను గొంతుకు చీర బిగించి భర్త గోపీ హత్య చేశాడు. కంచికచర్ల మండలం పేరకలపాడు వద్దకు రాగానే భూ లక్ష్మిని భర్త గోపీ చీరతో బిగించి చంపాడు. అనంతరం 108 కు ఫోన్ చేసి నందిగామ(Nandigama Circle), అనంతరం విజయవాడ తరలించే క్రమంలో భూలక్ష్మి మృతి చెందింది.
అనుమానం రాకుండా గోపీ తన నాన్నమ్మ గ్రామం ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు తరలించించాడు. భూ లక్ష్మీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతురాలి అంత్యక్రియలను పోలీసులు నిలిపివేశారు. భూ లక్ష్మి మెడపై గాయాలు ఉండటంతో పోలీసుల విచారణలో భార్యను చంపినట్టు భర్త గోపీ అంగీకరించాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని, తన బార్యకు తనకు మొదటి నుంచి సఖ్యత లేదని అందుకే చంపాలని నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుల సమక్షంలో భర్త గోపీ వెల్లడించారు.ఇదే అదునుగా భావించి చీర కొంగుతో భార్యను చంపినట్టు గోపీ పోలీసుల ఎదుట తెలిపాడు. Case నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నందిగామ రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ వెల్లడించారు.