Nandigama:రేపు నందిగామలో టిడిపి ఆధ్వ‌ర్యంలో బాబు రోడ్ షో

Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం రోడ్ షో కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. బాదుడే.. బాదుడు కార్య‌క్ర‌మంలో భాగంగా అధినేత రేపు రోడ్ షో నిర్వ‌హించ‌నున్న‌ట్టు మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంఛార్జి తంగిరాల సౌమ్య ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

nara chandrababu రోడ్ షో సంద‌ర్భంగా రేపు మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు నందిగామ నియోజ‌క‌వ‌ర్గం లో న‌గ‌ర పంచాయ‌తీలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు నందిగామ పట్ట‌ణ రైతుపేట TDP పార్టీ కార్యాల‌యం వ‌ద్ద‌కు పార్టీ శ్రేణులు చేరుకోనున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఇప్ప‌టికే ప్ర‌చార సాధ‌నాల‌తో ఊరూరా ప్ర‌చారం నిర్వ‌హించారు.

Nandigama: ప్ర‌త్యేక ఏర్పాట్లు

ప‌లు గ్రామాల నుండి బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి వ‌చ్చే తెలుగు దేశం కార్య‌క‌ర్త‌ల‌కు, అభిమానుల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే వారి వాహ‌నాల‌కు పార్కింగ్ స్థ‌లం కేటాయించారు. ఈ నేప‌థ్యంలో చంద‌ర్ల‌పాడు గ్రామం వైపు నుండి వ‌చ్చే వాహ‌నాలు వారు చందాపురం ఫ్లైఓవ‌ర్ ద‌గ్గ‌ర చందాపురం వైపు ఉన్న ఖాళీ ప్లాట్‌ల‌లో పార్కింగ్ చేయాల‌ని కోరారు.

Nandigama
తంగిరాల సౌమ్య‌

మ‌ధిర వైపు నుండి వ‌చ్చే వారు వారి వాహ‌నాల‌ను MRR కాలేజీ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాల‌ని, అనాసాగ‌రం గ్రామం వైపు నుండి వాహ‌నాలపై వ‌చ్చే వారు వారి వాహ‌నాల‌ను ఓల్డు బైపాస్ రోడ్డు వ‌ద్ద ఉన్న ఖాళీ స్థ‌లంలో పార్కింగ్ చేయాల‌ని సూచించారు.

Leave a Comment